Wednesday, 11 February 2026
  • Home  
  • ప్రజల వద్ద నుండి ఫిర్యాదులు స్వీకరించిన : కలెక్టర్
- తెలంగాణ

ప్రజల వద్ద నుండి ఫిర్యాదులు స్వీకరించిన : కలెక్టర్

నకిరేకల్ :నవంబర్ (పున్నమి ప్రతినిధి) ప్రజావాణి ఫిర్యాదులను జాప్యం లేకుండా పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా సోమవారం కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో ప్రజల వద్ద నుండి ఫిర్యాదులను స్వీకరించారు. ప్రజావాణి ఫిర్యాదుల పరిష్కారంపై జిల్లా అధికారులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని, ఫిర్యాదుల పరిష్కారంలో జాప్యం చేయవద్దు అని అన్నారు. ఎప్పటి ఫిర్యాదులు అప్పుడే పరిష్కరించాలన్నారు. ఈ సోమవారం మొత్తం 129 ఫిర్యాదులు రాగా, 73 ఫిర్యాదులు జిల్లా అధికారులకు, 56 రెవెన్యూ శాఖకు వచ్చాయి. ప్రజావాణి అనంతరం జిల్లా కలెక్టర్ అధికారులతో మాట్లాడుతూ వర్షం కారణంగా గ్రామాలలో నీరు నిలువ లేకుండా చూడాలని, డెంగ్యూ లాంటి వ్యాధులు రాకుండా, దోమలు వ్యాప్తి చెందకుండా పూర్తిగా శానిటేషన్ చేయాలని చెప్పారు.

నకిరేకల్ :నవంబర్ (పున్నమి ప్రతినిధి)
ప్రజావాణి ఫిర్యాదులను జాప్యం లేకుండా పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా సోమవారం కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో ప్రజల వద్ద నుండి ఫిర్యాదులను స్వీకరించారు. ప్రజావాణి ఫిర్యాదుల పరిష్కారంపై జిల్లా అధికారులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని, ఫిర్యాదుల పరిష్కారంలో జాప్యం చేయవద్దు అని అన్నారు. ఎప్పటి ఫిర్యాదులు అప్పుడే పరిష్కరించాలన్నారు. ఈ సోమవారం మొత్తం 129 ఫిర్యాదులు రాగా, 73 ఫిర్యాదులు జిల్లా అధికారులకు, 56 రెవెన్యూ శాఖకు వచ్చాయి. ప్రజావాణి అనంతరం జిల్లా కలెక్టర్ అధికారులతో మాట్లాడుతూ వర్షం కారణంగా గ్రామాలలో నీరు నిలువ లేకుండా చూడాలని, డెంగ్యూ లాంటి వ్యాధులు రాకుండా, దోమలు వ్యాప్తి చెందకుండా పూర్తిగా శానిటేషన్ చేయాలని చెప్పారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.