అనకాపల్లి జిల్లా, మార్చి 6, పున్నమి న్యూస్ ప్రతినిధి (ఆనంద్) :
ఎలమంచిలి రూరల్ ఎస్సై ఉపేంద్ర ఆధ్వర్యంలో పోలీస్ సిబ్బంది స్థానికంగా రోడ్లపై ప్రత్యేక వాహన తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా వాహనదారులు ట్రాఫిక్ నియమాలు పాటిస్తున్నారా లేదా అనే విషయాన్ని పోలీసులు క్షుణ్ణంగా పరిశీలించారు. హెల్మెట్ లేకుండా ప్రయాణం చేయడం, డ్రైవింగ్ లైసెన్స్ మరియు ఇతర వాహన పత్రాలు లేకపోవడం వంటి అంశాలపై తనిఖీలు చేపట్టారు. ట్రాఫిక్ నియమాలు ప్రజల భద్రత కోసం ఎంతో అవసరమని ఎస్సై ఉపేంద్ర తెలిపారు. ప్రతి వాహనదారుడు హెల్మెట్ ధరించి, అన్ని పత్రాలు వెంట ఉంచుకోవాలని సూచించారు. నియమాలను ఉల్లంఘించిన వారిపై చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ తనిఖీల ద్వారా రోడ్డు ప్రమాదాలను తగ్గించడం ప్రధాన లక్ష్యమని పోలీసులు పేర్కొన్నారు.



