డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు విలేకరుల సమావేశం
సర్వేపల్లి నియోజకవర్గం జనసేన పార్టీ సమన్వయకర్త బొబ్బేపల్లి సురేష్ నాయుడు ఆధ్వర్యంలో, సర్వేపల్లి జనసేన పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ,
> “ఇచ్చిన హామీలను నెరవేర్చుకుంటూ అభివృద్ధి వైపు కూటమి ప్రభుత్వం దూసుకెళ్తోంది. ముఖ్యంగా పంచాయతీరాజ్ శాఖ బాధ్యతలు స్వీకరించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, పల్లెల అభివృద్ధికి విశేష ప్రాధాన్యత ఇస్తున్నారు,” అని తెలిపారు.
సర్వేపల్లి (వెంకటాచలం):- పంచాయతీలకు కేంద్రం నుంచి వచ్చే నిధులను పారదర్శకంగా వినియోగించేందుకు ప్రతి రూపాయి వివరాలు ప్రజలకే అందేలా ‘జియో రూరల్ రోడ్ మేనేజ్‌మెంట్ సిస్టం’ ద్వారా సమాచారం పంచుకునే కొత్త విధానం త్వరలో అందుబాటులోకి రానుందని చెప్పారు.


