ఖమ్మం అక్టోబర్ (పున్నమి ప్రత్యేక ప్రతినిధి)
ప్రజలకు ఇచ్చిన హామీలను తుంగలో తొక్కిన అధికార కాంగ్రెస్ పార్టీని స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓడించాలి అని సత్తుపల్లి మాజీ శాసన సభ్యులు భారత రాష్ట్ర సమితి రాష్ట్రనాయకులు సండ్ర వెంకట వీరయ్య కార్యకర్తలకి పిలుపినిచ్చారు
ఖమ్మం లో బుధవారం నాడు జిల్లా అధ్యక్షులు తాత మధు అధ్యక్షతన జరిగిన స్థానిక సంస్థ ల సన్నాహక సమావేశం లో అయన పాల్గొని మాట్లాడుతూ
ఖమ్మం జిల్లాలో బిఆర్ఎస్ హయాంలో తెలంగాణ సాధకుడు కెసిఆర్ చేసిన అభివృద్ధి తప్పితే జిల్లాకి ముగ్గురు మంత్రులు చేసిందేంటో చెప్పుకోలేని పరిస్థితని అన్నారు
అహర్నిశలు పార్టీ కోసం కష్టపడే కార్యకర్తలకే స్థానిక సంస్థ ఎన్నికల్లో పెద్దపీట వేస్తాం అన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం వైఫల్యాలను ప్రజా క్షేత్రంలో ఎండబెట్టడం కోసం ప్రతి కార్యకర్త నడుంబిగించి పనిచేయాల్సిన సమయం ఆసన్నమైందన్నారు
బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశాల మేరకు రాష్ట్ర పార్టీ రూపొందించిన కాంగ్రెస్ బాకీ కార్డులను ఇంటింటికి చేరవేసే బాధ్యత ప్రతి కార్యకర్తపై ఉందన్నారు
అమలు కానీ హామీలలతో తెలంగాణ ప్రజలను నయవంచన చేసిన కాంగ్రెస్ పార్టీకి వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో బుద్ధి చెప్పేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు
స్థానిక ఎన్నికల్లో గెలుపు కోసం గ్రామస్థాయి నుంచి నియోజకవర్గ స్థాయి వరకు పక్కా ప్రణాళికతో నాయకులు మరియు కార్యకర్తలు పనిచేయాలన్నారు
జిల్లా పార్టీ కార్యాలయంలో సమన్వయం కోసం ఎన్నికల సెల్ మరియు లీగల్ సెల్ ఏర్పాటు చేస్తామన్నారు
ప్రభుత్వ ఆగడాలను నిర్బంధాలను ఎదుర్కోవటం కోసం కార్యకర్తలకు జిల్లా కేంద్రం ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటుందన్నారు.
జిల్లాలోని ఐదు నియోజకవర్గాల ముఖ్య కార్యకర్తలతో ఏర్పాటు చేసిన ఈ సన్నాహక ఈ సమావేశం లో
ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, మాజీ ఎమ్మెల్యేలు, కందాల ఉపేందర్ రెడ్డి, బానోతు చంద్రావతి మాజీ జడ్పీ చైర్మన్ లింగాల కమల్ రాజు, లకావత్ గిరిబాబు, బానోత్ మంజుల తదితరులు పాల్గొన్నారు.


