పున్నమి ప్రతినిధి | నెల్లూరు | 07-01-2026
నెల్లూరు జిల్లావ్యాప్తంగా ప్రజలకు అవగాహన కల్పించే కార్యక్రమాలను పోలీసులు విస్తృతంగా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఎస్పీ డా. అజిత్ వేజెండ్ల, ఐపీఎస్ తెలిపారు. ఎస్పీ ఆదేశాలు, అదనపు ఎస్పీ (అడ్మిన్) సూచనల మేరకు గ్రామస్తులు, గ్రామ పెద్దలు, యువతతో సమావేశాలు నిర్వహిస్తున్నారు. నేర నియంత్రణ, శాంతి భద్రతలు, సైబర్ మోసాలు, గంజాయి, ఇసుక అక్రమ రవాణా, రోడ్డు ప్రమాదాల నివారణ, మహిళలు–బాలబాలికల భద్రతపై అవగాహన కల్పిస్తున్నారు. గ్రామాల్లో సామరస్యంగా జీవించాలని, చట్ట వ్యతిరేక చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. అనుమానాస్పద సమాచారం కోసం 112 లేదా ఈగల్ సెల్ 1972కు తెలియజేయాలని సూచించారు.


