ప్రజలకు అందుబాటులో ఉండే శ్రీ గణేష్ డ్రగ్ హౌస్
శ్రీ గణేష్ డ్రగ్ హౌస్ ప్రారంభోత్సవంలో ముఖ్య అతిథులుగా పాల్గొన్న కార్పొరేటర్ కళ్లెం నవజీవన్ రెడ్డి
పున్నమి: జూలై 26 ప్రతినిధి దూపం అంజనేయులు అబ్దుల్లాపూర్ మెట్ మండలం రంగారెడ్డి జిల్లా, హయత్ నగర్ లోని కుంట్లూర్ ప్రధాన రోడ్డు మార్గంలో నూతనంగా ఏర్పాటు చేసిన శ్రీ గణేష్ డ్రగ్ హౌస్ ప్రారంభోత్సవంలో ముఖ్య అతిథులుగా హయత్ నగర్ డివిజన్ కార్పొరేటర్ కళ్లెం నవజీవన్ రెడ్డి మరియు హయత్ నగర్ సర్కిల్ ఇన్స్పెక్టర్ నాగరాజ్ గౌడ్ పాల్గొనడం జరిగింది.
ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ ముందుగా డ్రగ్ హౌస్ ఏర్పాటు చేసిన ఉప్పుల మాథ్స్యగిరి , మొర్రి మల్లేష్,మెండే క్రిష్ణ మరియు మెండే మల్లేష్ లకు శుభాకాంక్షలు తెలిపారు. అదేవిధంగా హయత్ నగర్ ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా డ్రగ్ హౌస్ ఏర్పాటు చేసినందుకు వారు అభినందించారు. ఈ కార్యక్రమం సబ్ ఇన్స్పెక్టర్లు వెంకట్ రెడ్డి, నర్సింహా మరియు బీజేపీ డివిజన్ ప్రధాన కార్యదర్శి ఎర్రవెలి సత్యనారాయణ, బీజేపీ జిల్లా నాయకులు జంజ్య నాయక్ మరియు తదితరులు పాల్గొన్నారు.