పున్నమి ప్రతినిధి
స్వతంత్ర యువజన ఉద్యమ ధృవ భగత్ సింగ్ స్పూర్తితో నవయువ భారత నిర్మాణములో యువత పాత్ర ఎంతో కీలకమైనది. అటువంటి యువత నేడు మాదక ద్రవ్యాలకు బానిసలై యువ శక్తి నిర్వీర్యం అవ్వడం దేశ ప్రగతికి విఘాతం. ఇటువంటి తరుణంలో భగత్ సింగ్ 118వ జయంతిని పురస్కరించుకొని అఖిల భారత యువజన సమాఖ్య రాష్ట్ర సమితి ఆధ్వర్యంలో మత్తు పదార్థాలకు వ్యతిరేకంగా సెప్టెంబరు 28 నుంచి అక్టోబర్ 4 వరకు రాష్ట్ర వ్యాప్తంగా యువజన చైతన్య వారోత్సవాలు నిర్వహిస్తున్నట్లు ఈ కార్యక్రమం ద్వారా మత్తు పదార్థాల వాడకం వల్ల జరిగే దుష్పరిణామాలపై అవగాహన కార్యక్రమాలు చెప్పటనునము అని ఎఐవైఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు నేడు ఒక ప్రకటనలో తెలియజేశారు. ఈ సందర్భంగా జరిగిన గోడప్రతిక ఆవిష్కరణ కార్యక్రమంలో గోవిందరాజులు మాట్లాడుతూ రాష్ట్రంలో మాదక ద్రవ్యాల వాడకం విపరీతంగా పెరిగిపోతోంది అని ఈ సంస్కృతి నేడు కళాశాల స్థాయి నుంచి పాఠశాల స్థాయికి వచ్చిందంటే ఇందులో పాలకుల వైఫల్యం స్పష్టంగా కనిపిస్తోందని తెలియజేశారు.
నేడు యువతకు విద్య, ఉద్యోగ,ఉపాధి అవకాశాలు అందని ద్రాక్షగా ఉన్నప్పటికీ గంజాయి, డ్రగ్స్ వంటి మత్తు పదార్దాలు మాత్రం విచ్చలవిడిగా పట్టణాల నుండి గ్రామాల వరకు అందుబాటులోకి రావడం ఆందోళనకరం. ప్రభుత్వం మాదక ద్రవ్యాలను కట్టడి చేయడంలో మరింత శ్రద్ధ తీసుకోసుకోని యువతను మాదక ద్రవ్యాలకు దూరంగా వారిలోని నైపుణ్యాలను, క్రీడా పెంపొందించే విధముగా నిర్దిష్టమైన కార్యాచరణ ప్రకటించాలి అని కోరారు.
ఈ కార్యక్రమంలో నగర అధ్యక్షులు కంచర్ల భార్గవ్ బాలల సంఘం రాష్ట్ర కన్వీనర్ ఎం. సాయి కుమార్, గంటా మమత, సింగంశేట్టి మోహన్ కుమార్, రంజిత్,జగదీష్, సుదీర్ లు పాల్గొన్నారు.


