పున్నమి రంగారెడ్డి జిల్లా ప్రతినిధి( సంగిశెట్టి ధనుంజయ్ ) నవంబర్ 23 : రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ లో జిల్లా ఇన్ఛార్జి మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ఆడపడుచులకు ఇందిరమ్మ చీరెలు పంపిణీ చేశారు. రాష్ట్రప్రభుత్వం మహిళా ఉన్నతి- తెలంగాణ ప్రగతి – ఇందిరా మహిళా శక్తి నినాదంతో స్వయం సహాయ బృందాలకు, తెల్ల రేషన్ కార్డు లబ్దిదారులకు చీరెలు పంపిణీ చేస్తోంది. ఈ సందర్భంగా రంగారెడ్డి జిల్లా మహిళలకు చీరెల పంపిణీ కార్యక్రమాన్ని మంత్రి శ్రీధర్ బాబు ఇవాళ ప్రారంభించారు.ఈ కార్యక్రమానికి మహేశ్వరం నియోజకవర్గం కాంగ్రెస్ ఇన్ఛార్జి, మాజీ ఎమ్మెల్యే కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి హాజరయ్యారు. ప్రతీ ఆడబిడ్డకు సారె పెట్టాలని సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణ ప్రభుత్వం భావిస్తుందన్నారు. కోటి మంది మహిళలకు డిసెంబర్ 9లోగా పంపిణీ చేస్తామన్నారు. వచ్చే సర్పంచ్ ఎన్నికల్లో మహేశ్వరం, కందుకూరు మండలాల్లో మహిళలకు అత్యధిక స్థానాలు కేటాయించినట్లు కేఎల్ఆర్ తెలిపారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలే అభ్యర్థుల విజయానికి నాంది పలుకుతాయని కిచ్చెన్న ఆశాభావం వ్యక్తం చేశారు.భారత్ ఫ్యూచర్ సిటీలో డిసెంబర్ 8/9తేదీల్లో జరిగే గ్లోబల్ సమ్మిట్ నిర్వాహణ పనుల పరిశీలనలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో కలిసి కె ఎల్ ఆర్ పరిశీలించారు.

* ప్రగతి పథంలో తెలంగాణ ఆడపడుచులు —మహేశ్వరంలో ప్రతీ ఆడబిడ్డకు “సారె’ పెట్టి గౌరవిస్తాం –గ్లోబల్ సమ్మిట్ పనులను సీఎంతో కలిసి పరిశీలించిన లక్ష్మారెడ్డి*