Tuesday, 24 March 2026
  • Home  
  • ప్రకృతి రక్షణ కేవలం ప్రభుత్వ బాధ్యత కాదు — ప్రతి పౌరుడి బాధ్యత.
- తూర్పు గోదావరి

ప్రకృతి రక్షణ కేవలం ప్రభుత్వ బాధ్యత కాదు — ప్రతి పౌరుడి బాధ్యత.

“ప్రకృతి రక్షణ కేవలం ప్రభుత్వ బాధ్యత కాదు — ప్రతి పౌరుడి బాధ్యత.” – డి ఎమ్ హెచ్ వో వెంకటేశ్వర రావు రాజమహేంద్రవరం : “వరల్డ్ వన్ హెల్త్ డే” పురస్కరించుకొని నవంబర్ 3 నుంచి 9 వరకు “వన్ హెల్త్” వారోత్సవ కార్యక్రమాలు జిల్లాలో నిర్వహిస్తున్నట్లు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ కె. వెంకటేశ్వరరావు తెలిపారు . స్థానిక డి ఎమ్ హెచ్ వో కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమం లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా డా కే. వెంకటేశ్వర రావు మాట్లాడుతూ, “ఆరోగ్యం మహాభాగ్యం. ఒకరి ఆరోగ్యాన్ని కాపాడితే, సమాజంలోని ప్రతి ఒక్కరి ఆరోగ్యాన్ని కాపాడినట్టే అవుతుందని తెలిపారు. ప్రకృతిని సంరక్షించడం ద్వారా మానవజీవితం సురక్షితమవుతుందని, చెట్లు నాటడం జీవరక్షణకు దారి తీస్తుందని ఆయన పేర్కొన్నారు. స్వచ్ఛమైన గాలి, నీరు, ఆహారం ప్రకృతిని కాపాడినప్పుడే సాధ్యమవుతుందన్నారు. వ్యాయామం మరియు యోగా మన ఆరోగ్యానికి మూలాధారమని ఆయన తెలిపారు. పర్యావరణ పరిరక్షణలో ప్రతి పౌరుడు తన వంతు పాత్ర పోషించాలన్నారు. “వన్ వరల్డ్ హెల్త్ డే” సందర్భంగా ప్రజల్లో సామాజిక ఆరోగ్య అవగాహన పెంపొందించడం, పర్యావరణ పరిరక్షణపై చైతన్యం కల్పించడం ఈ కార్యక్రమ ప్రధాన లక్ష్యం అన్నారు. ఈ కార్యక్రమంలో ఇన్‌చార్జ్ జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి డాక్టర్ షమ్మీకుమార్, డాక్టర్ శ్రీవల్లి (DPMU), సూపరింటెండెంట్ స్టాలిన్, సి.సి. రాజు, కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

“ప్రకృతి రక్షణ కేవలం ప్రభుత్వ బాధ్యత కాదు — ప్రతి పౌరుడి బాధ్యత.”
– డి ఎమ్ హెచ్ వో వెంకటేశ్వర రావు
రాజమహేంద్రవరం :

“వరల్డ్ వన్ హెల్త్ డే” పురస్కరించుకొని నవంబర్ 3 నుంచి 9 వరకు “వన్ హెల్త్” వారోత్సవ కార్యక్రమాలు జిల్లాలో నిర్వహిస్తున్నట్లు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ కె. వెంకటేశ్వరరావు తెలిపారు .

స్థానిక డి ఎమ్ హెచ్ వో కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమం లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా డా కే. వెంకటేశ్వర రావు మాట్లాడుతూ,
“ఆరోగ్యం మహాభాగ్యం. ఒకరి ఆరోగ్యాన్ని కాపాడితే, సమాజంలోని ప్రతి ఒక్కరి ఆరోగ్యాన్ని కాపాడినట్టే అవుతుందని తెలిపారు.
ప్రకృతిని సంరక్షించడం ద్వారా మానవజీవితం సురక్షితమవుతుందని, చెట్లు నాటడం జీవరక్షణకు దారి తీస్తుందని ఆయన పేర్కొన్నారు. స్వచ్ఛమైన గాలి, నీరు, ఆహారం ప్రకృతిని కాపాడినప్పుడే సాధ్యమవుతుందన్నారు. వ్యాయామం మరియు యోగా మన ఆరోగ్యానికి మూలాధారమని ఆయన తెలిపారు. పర్యావరణ పరిరక్షణలో ప్రతి పౌరుడు తన వంతు పాత్ర పోషించాలన్నారు.

“వన్ వరల్డ్ హెల్త్ డే” సందర్భంగా ప్రజల్లో సామాజిక ఆరోగ్య అవగాహన పెంపొందించడం, పర్యావరణ పరిరక్షణపై చైతన్యం కల్పించడం ఈ కార్యక్రమ ప్రధాన లక్ష్యం అన్నారు.

ఈ కార్యక్రమంలో ఇన్‌చార్జ్ జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి డాక్టర్ షమ్మీకుమార్, డాక్టర్ శ్రీవల్లి (DPMU), సూపరింటెండెంట్ స్టాలిన్, సి.సి. రాజు, కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.