*ప్రకృతి అనుకూల ఆవిష్కరణలు రావాలి*
*16 వ సెషన్ లో వక్తలు*
*విశాఖపట్నం,నవంబర్ పున్నమి ప్రతినిధి*:
ప్రకృతికి అనుకూలమైన ఆవిష్కరణలు చేయాలని పలువురు వక్తలు కోరారు. అభివృద్ధి ప్రక్రియలో ప్రకృతి వనరులకు నష్టం వాటిల్లకూడదని స్పష్టం చేశారు. 30వ సిఐఐ భాగస్వామ్య సదస్సులో భాగంగా, 3 వ సెమినార్ హాలులో బయోడిజైన్ : డిజైనింగ్ ఫర్ పీపుల్ అండ్ నేచర్ అన్న అంశంపై 16 సెషన్ నిర్వహించారు.
ఈ సదస్సులో వివిధ రంగాల ప్రతినిధులు మేఘఅవస్థీ, అంజా కారన్, ఏవీఆర్ శ్రీకర్, పెనుమత్స సురేష్ రాజు, మొహిన్ మెహతా పాల్గొన్నారు. సుచిత్ర ఎల్లా మోడరేటర్ గా వ్యవహరించారు.
ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణ ప్రాధాన్యతను వివరించారు. మనిషి ప్రకృతికి దూరం కాకూడదని స్పష్టం చేశారు. మానవ మనుగడ, భవిషత్ తరాల శ్రేయస్సు కోసం పర్యావరణ అనుకూల విధానాలను అవలంభించాలని సూచించారు.


