కామారెడ్డి, 24 అక్టోబర్ (పున్నమి ప్రతినిధి) :
రామారెడ్డి మండలంలోని పోసానిపేట గ్రామంలో వ్యక్తి ఉరివేసుకుని మృతి చెందిన ఘటన గ్రామంలో విషాదాన్ని మిగిల్చింది. ఈ ఘటన గురువారం రాత్రి చోటుచేసుకుంది. పోలీస్ సబ్ ఇన్‌స్పెక్టర్ భువనేశ్వర్ తెలిపిన వివరాల ప్రకారం, పోసానిపేటకు చెందిన మంగలి బాలయ్య (50) హైదరాబాద్‌లోని వెల్నెస్ హాస్పిటల్‌లో వాచ్‌మన్ గా పనిచేస్తున్నాడు.కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం, బాలయ్య కొంత కాలంగా మద్యా నికి అలవాటై తరుచుగా మద్యం సేవించటం వల్ల ఇంట్లో తగాదాలు జరుగుతున్నాయి. ఇటీవలి కాలంలో ఆర్థిక ఇబ్బందులు, కుటుంబ సమస్యల కారణంగా తీవ్ర మనస్తాపానికి లోనైన ఆయన జీవితం పట్ల విరక్తి చెంది గురువారం రాత్రి ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకుని ఆత్మహ త్యకు పాల్పడ్డాడు.వివరాలు తెలిసిన వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీ లించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కామారెడ్డి ప్రభుత్వ జనరల్ హాస్పిటల్ (జి.జి.హె చ్)కి తరలించారు. మృతునికి భార్య మంగలి సవిత, ఒక కుమారుడు, ఒక కుమార్తె ఉన్నారు. ఇద్దరూ వివాహ జీవితంలో ఉన్నారని కుటుంబ సభ్యులు తెలిపారు.కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ భువనేశ్వర్ తెలిపారు. ఈ ఘటనతో గ్రామంలో విషాద వాతావరణం నెలకొంది.


