పోలీస్ స్టేషన్ ఎదుట మహిళ ఆత్మహత్యాయత్నం, సకాలంలో స్పందించిన పోలీసులు, మహిళ క్షేమం.
అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు నవంబర్ 16( పున్నమి న్యూస్ ప్రతినిధి – సింగమాల వెంకటేష్ )
రైల్వే కోడూరు పట్టణంలోని పోలీస్ స్టేషన్ ఎదుట ఒక ముస్లిం మహిళ పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించారు సమయానికి విధుల్లో ఉన్న ఇద్దరు కానిస్టేబుళ్లు వెంటనే మహిళను నిలువరించారు. రైల్వే కోడూరు మండలం శెట్టిగుంట గ్రామపంచాయతీకి చెందిన యాస్మిన్, అదే గ్రామానికి చెందిన అన్సర్ అనే వ్యక్తి 2023 లో వివాహం చేసుకున్నారని తెలియ వస్తోంది.తదనంతరం కువైట్ దేశానికి వెళ్లి ఇటీవలే తిరిగి వచ్చిన ఆన్సర్ రాజంపేటకు చెందిన వేరే మహిళతో వివాహం చేసుకున్నాడని తెలుసుకున్న సదరు మహిళ, రైల్వే కోడూరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. ఫిర్యాదు చేసి 4 రోజులు కావస్తున్నా, ఆన్సర్ పై ఎటువంటి చర్య తీసుకోకపోవడంతో పోలీస్ స్టేషన్ గేటు వద్ద పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకునేందుకు ప్రయత్నించగా సకాలంలో పోలీసులు స్పందించి నిలువరించడంతో ప్రమాదం తప్పింది. ఈ విషయంగా విచారణ జరుపుతున్నట్లు సమాచారం.


