ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖ పనితీరుపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. డీజీపీతో పాటు మొత్తం పోలీస్ వ్యవస్థనే నిద్రావస్థలో ఉందని వ్యాఖ్యానిస్తూ, “ఇలా ఉంటే పోలీస్ శాఖను మూసేయడం మంచిదేమో” అని తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. టిటిడి పరకామణి కేసులో లోక్ అదాలత రాజీ రికార్డులను సీజ్ చేయాలని సెప్టెంబర్ 19న హైకోర్టు ఆదేశించినా, CIDలో IG స్థాయి అధికారి పోస్టు ఖాళీగా ఉందని కారణం చెబుతూ పోలీస్ శాఖ ఆ ఆదేశాలను అమలు చేయలేదని తెలిపింది. సదుద్దేశం ఉంటే మరో IG ద్వారా ఆ చర్య చేపట్టేవారని కోర్టు వ్యాఖ్యానించింది.

“పోలీస్ శాఖను మూసేయడం బెటర్” – ఏపీ హైకోర్టు తీవ్ర అసంతృప్తి