ఓర్వకల్ మరియు కర్నూలు 4వ పట్టణ పోలీస్ స్టేషన్‌ల పరిధిలో జరిగిన రెండు హత్య కేసులపై విచారణలో పోలీసు నిర్లక్ష్యం, నిందితులకు మద్దతు వంటి అంశాలపై నవజ్యోతి హ్యూమన్ రైట్స్ సంస్థ హైకోర్టును ఆశ్రయించింది.
ఈ మేరకు సంస్థ అధినేత పల్ల బాల మద్దిలేటీ @ బాలు ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
వివరాల్లోకి వెళ్తే —
కర్నూలు జిల్లా ఓర్వకల్లు మండలంలోని బ్రాహ్మణపల్లికి చెందిన వడ్డే ఎల్లమ్మ గారి భర్త వడ్డే శివశంకర్, అలాగే మరిది వడ్డే రామకృష్ణుడు రార్ల హత్య కేసుల్లో విచారణలో అవకతవకలు జరిగినట్లు ఆరోపించారు.
ఓర్వకల్లు పోలీసులు నిందితులను కేసు నుంచి తప్పించి ఛార్జ్‌షీట్ సమర్పించడం ద్వారా న్యాయస్థానాన్ని తప్పుదోవ పట్టించారని పిటిషన్‌లో పేర్కొన్నారు.
అలాగే కర్నూలు 4వ పట్టణ పోలీస్‌స్టేషన్ పరిధిలో వడ్డే రామకృష్ణుడు 4 సంవత్సరాలుగా అదృశ్యమైన కేసులో ఇప్పటికీ విచారణ జరగలేదని, ఛార్జ్‌షీట్ కూడా దాఖలు కాలేదని పిటిషనర్ తెలిపారు.
ఈ అంశాలపై పలు మార్లు ఓర్వకల్లు S.I, కర్నూలు 4వ పట్టణ SHO, DSP, SPలకు ఫిర్యాదులు చేసినా స్పందన రాకపోవడంతో, చివరికి న్యాయం కోసం హైకోర్టును ఆశ్రయించామని బాలు మీడియా ద్వారా తెలిపారు.
పోలీస్ అధికారులు బాధితుల ఆవేదనను గుర్తించి, కేసులపై పూర్తి స్థాయిలో పునర్విచారణ జరిపి న్యాయం చేయాలని ఆయన డిమాండ్ చేశారు.

పోలీస్ నిర్లక్ష్యంపై హైకోర్టును ఆశ్రయించిన నవజ్యోతి హ్యూమన్ రైట్స్ సంస్థ
ఓర్వకల్ మరియు కర్నూలు 4వ పట్టణ పోలీస్ స్టేషన్‌ల పరిధిలో జరిగిన రెండు హత్య కేసులపై విచారణలో పోలీసు నిర్లక్ష్యం, నిందితులకు మద్దతు వంటి అంశాలపై నవజ్యోతి హ్యూమన్ రైట్స్ సంస్థ హైకోర్టును ఆశ్రయించింది. ఈ మేరకు సంస్థ అధినేత పల్ల బాల మద్దిలేటీ @ బాలు ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. వివరాల్లోకి వెళ్తే — కర్నూలు జిల్లా ఓర్వకల్లు మండలంలోని బ్రాహ్మణపల్లికి చెందిన వడ్డే ఎల్లమ్మ గారి భర్త వడ్డే శివశంకర్, అలాగే మరిది వడ్డే రామకృష్ణుడు రార్ల హత్య కేసుల్లో విచారణలో అవకతవకలు జరిగినట్లు ఆరోపించారు. ఓర్వకల్లు పోలీసులు నిందితులను కేసు నుంచి తప్పించి ఛార్జ్‌షీట్ సమర్పించడం ద్వారా న్యాయస్థానాన్ని తప్పుదోవ పట్టించారని పిటిషన్‌లో పేర్కొన్నారు. అలాగే కర్నూలు 4వ పట్టణ పోలీస్‌స్టేషన్ పరిధిలో వడ్డే రామకృష్ణుడు 4 సంవత్సరాలుగా అదృశ్యమైన కేసులో ఇప్పటికీ విచారణ జరగలేదని, ఛార్జ్‌షీట్ కూడా దాఖలు కాలేదని పిటిషనర్ తెలిపారు. ఈ అంశాలపై పలు మార్లు ఓర్వకల్లు S.I, కర్నూలు 4వ పట్టణ SHO, DSP, SPలకు ఫిర్యాదులు చేసినా స్పందన రాకపోవడంతో, చివరికి న్యాయం కోసం హైకోర్టును ఆశ్రయించామని బాలు మీడియా ద్వారా తెలిపారు. పోలీస్ అధికారులు బాధితుల ఆవేదనను గుర్తించి, కేసులపై పూర్తి స్థాయిలో పునర్విచారణ జరిపి న్యాయం చేయాలని ఆయన డిమాండ్ చేశారు.

