విశాఖపట్నం పున్నమి ప్రతినిధి:- నగర పోలీసు కమీషనర్ డా.శంఖబ్రత బాగ్చి, ఐ.పి.ఎస్., గారు కాన్ఫరెన్స్ హాల్ నందు పోలీసు ఉన్నతాధికారులతో కలిసి ఏడీసీపీలు నుండి ఇన్స్పెక్టర్ స్థాయి అధికారులతో ఏర్పాటు చేసిన ఈ నెల రివ్యూ మీటింగ్ లో ప్రతి ఒక్క పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ల పనితీరును పరిశీలించారు.*
◼️నగరంలో ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో యాక్టీవ్ గా ఉన్న రౌడీ షీటర్లు,వారిపై పెడుతున్న నిఘా చర్యలను ఆరా తీశారు, నిన్నటి వరకూ నమోదు చేసిన NDPS కేసు వివరాలను సమీక్షించి, నగరం గుండా ఏటువంటి NDPS రవాణా జరగకుండా పూర్తిగా నిరోధించాలని తెలిపారు.
◼️ ట్రాఫిక్, క్రైమ్, లా అండ్ ఆర్డర్ లకు నిర్వహించిన ఈ నెల రివ్యూ మీటింగ్ నందు ఆయా విభాగాల పనితీరును సీపీ గారు పూర్తిగా సమీక్షించారు.
◼️ నగరంలో పోలీస్ స్టేషన్లో లాంగ్ పెండింగ్ లో ఉన్న కేసులు యొక్క వివరాలు, కేసు పెండింగ్ ఉండడానికి గల కారణాలు తెలుసుకొని సదరు పెండింగ్లో ఉన్న కేసులను సత్వరమే పరిష్కరించివలసిందిగా ఆదేశించారు, కోర్టు తీర్పు వెలువరించిన కేసుల వివరాలు తెలుసుకున్నారు.
◼️ సిపి గారి ఇచ్చిన నంబరు కు వచ్చిన ఫిర్యాదులు ఆధారముగా పలు సమస్యాత్మక ప్రాంతాలను సిపి గారు తెలియజేసి, ఆయా ప్రాంతాలకు సంబంధించిన స్టేషన్ ఎస్.హెచ్.ఓ లతో ఆయా సమస్యలకు పూర్తి అడ్డుకట్ట వేసేలా నిర్ణీత సమయంలో చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
◼️ ప్రతీ స్టేషన్ పరిధిలో యెటువంటి అసాంఘిక కార్యకలాపాలు జరుగకుండా పూర్తిగా నివారించాలని, ఆయా స్టేషన్ పరిధిలో గల నిర్మానుష్యప్రాంతాలను, సమస్యాత్మక ప్రాంతాలను పరిశీలిస్తూ విజిబుల్ పోలీసింగ్, పీకేట్, అవసరం మేరకు డికొయ్ టీంలను ఏర్పాటు చేయాలని ఆదేశించారు.
◼️ స్టేషన్ పరిధిలో శాంతి భద్రతలు పూర్తి అదుపులో ఉండాలనీ, గంజాయి ఎక్కడా ఉండరాదని, ఈవ్ టీజింగ్, ట్రిపుల్ రైడింగ్, రాష్ డ్రైవింగ్ వంటి ఏ స్టేషన్ పరిధిలోనూ చోటు చేసుకోకుండా పటిష్ట చర్యలు తీసుకోవాలని, అందుకు అదనంగా వెహికల్, మెన్ ఇతర అవసరాలు ఏమైనా ఉన్నచో తనకు తెలియజేయాలని తెలిపారు.
◼️ నగరంలో అన్ని పోలీస్ స్టేషన్ల లో కేసులు నమోదు చేస్తున్న తీరు, అధికారులు ఫిర్యాదుదారులతో ప్రవర్తిస్తున్న తీరు పై ఆరా తీసి, తగు ఆదేశాలు జారీ చేశారు.
◼️ పొక్సో కేసుల పైన ఆరా తీశారు, నగరంలో క్రైమ్ రేటు తగ్గు ముఖం పట్టేలా రాత్రి పూట నిఘా మరింత పటిష్టం చేయాలనీ తెలిపారు.
◼️ VMS(విజిటర్స్ మానిటరింగ్ సిస్టమ్) ను పూర్తిగా లా & ఆర్డర్ మరియు క్రైమ్ సిబ్బంది అందరూ వినియోగిస్తూ నిందితులను మరింత వేగముగా గుర్తించాలని తెలిపారు.
◼️ సైబర్ క్రైమ్ పై మరింత బలోపేతం చేసే చర్యలపై చర్చించారు, ప్రజలకు పూర్తి అవగాహన అయ్యేలా మరిన్ని అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని తెలిపారు, పలు కొత్త సాఫ్ట్ వేర్ లను తీసుకొని వినియోగించాలని సూచించారు.
◼️ ఉమెన్ సేఫ్టీ కు ప్రధమ ప్రాధాన్యత ఇవ్వాలని, మహిళల పైన వేదింపులు, మహిళ మిస్సింగ్ సంబంధిత కేసులలో జాప్యం లేకుండా తక్షణమే స్పందించి ఫ్రెండ్లీ పోలీసింగ్ విధానంలో వారితో వ్యవహరించాలన్నారు,పొక్సో కేసుల పైన ఆరా తీశారు.
◼️ కోర్టు నందు కేసులు ఎటువంటి జాప్యం లేకుండా, కన్విక్షన్ పడే కేసులు సంఖ్య పెరిగే విధముగా చేయుటకు, అధికారులు మరియు సిబ్బంది సందేహలను నివృత్తి చేసేందుకు
◼️ లోక్ ఆధాలత్ నందు గతంలో కంటే మరిన్ని ఎక్కువ కేసులు పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు.
◼️ పబ్లిక్ ప్రాసిక్యూటర్లను ఆహ్వానించి పలు న్యాయ సంబంధిత అంశాలపై పరస్పరం చర్చించి, పోలీసు అధికారులు పలు న్యాయ సంబంధిత అంశాలలో తమ సందేహాలను పబ్లిక్ ప్రాసిక్యూటర్లను ను అడిగి నివృత్తి చేసుకున్నారు.
◼️ వచ్చే నెల నిర్వహించబోవు రివ్యూ మీటింగ్ నందు ప్రతి పోలీస్ స్టేషన్ గత నెల కంటే మెరుగ్గా, క్రైమ్ తగ్గు ముఖం పట్టే విధముగా పోలీసింగ్ ఉండాలని తెలిపారు.
◼️నగర పోలీసు అధికారులు మరియు సిబ్బంది పూర్తి పారదర్శకముగా తమ విధులు నిర్వర్తించాలని, విధులలో ఎటువంటి చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినా, అధికార దుర్వినియోగానికి పాల్పడినా, అవినీతికి పాల్పడినా తక్షణమే వారిపై కఠిన చర్యలు ఉంటాయనీ తెలిపారు.
ఈ సమావేశంలో డి.సి.పి-01(ఎల్& ఓ) వి.ఎన్. మణికంఠ చందోలు,ఐ.పీ.ఎస్.,గారు, డి.సి.పి-02(ఎల్& ఓ) డి.మేరీ ప్రశాంతి, ఐ.పి.ఎస్., గారు, డి.సి.పి(క్రైమ్స్) శ్రీమతి లతా మాధురి,ఐ.పి.ఎస్., గారు, నగర ఏ.డి.సి.పి లు, ఏ.సి.పి లు, స్టేషన్ ఎస్.హెచ్.ఓ లు, ఇతర అధికారులు మరియు సిబ్బంది పాల్గొన్నారు


