పున్నమి ప్రతి నిధి
పోలీసు అమరవీరుల దినం సందర్భంగాతెలంగాణ రాష్ట్ర ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి పుష్పాంజలి ఘటించి ఘన నివాళి అర్పించారు. ఈ సంధర్భముగా రేవంత్ వారి త్యాగాలను స్మరించుకుని, సమాజ భద్రతలో వారి సేవలను కొనియాడి, వారి కుటుంబ సభ్యుల సంక్షేమానికి ప్రజా ప్రభుత్వం కట్టుబడి ఉన్నదని భరోసా ఇచ్చారు.
విధి నిర్వహణలో అమరులైన పలువురు పోలీసు సిబ్బంది కుటుంబ సభ్యులను పరామర్శించారు. వారు అనాధలు కాదని వారికి ప్రభుత్వం అండగా ఉంటుంది అని రేవంత్ భరోసా ఇచ్చారు అర్హులైన కుటుంబ సభ్యులకు ఉద్యోగం, ఇంటి జాగా, ఆర్థిక సహాయంతో పాటు వారి బిడ్డల చదువుల బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుందని హామీ ఇచ్చారు యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ ద్వారా వారికి నాణ్యమైన, అత్యున్నత ప్రమాణాలతో కూడిన విద్యని అందిస్తామని ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి అమరుల కుటుంబ సభ్యులకి తెలియజేసారు


