పున్నమి ప్రతినిధి – ఒంగోలు
ప్రకాశం జిల్లా ఒంగోలు పట్టణంలోని రిమ్స్ ఆడిటోరియంలో పోలీసు ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థుల కోసం ఇంపాక్ట్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రత్యేక శిక్షణా కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సుమారు 700 మంది పోలీసు అభ్యర్థులు హాజరై ఉత్సాహంగా పాల్గొన్నారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇంపాక్ట్ ఫౌండేషన్ ఫౌండర్, సైకాలజిస్ట్ మరియు మోటివేషనల్ ట్రైనర్ శ్రీ గంపా నాగేశ్వర రావు గారు హాజరై అభ్యర్థులకు మార్గదర్శనం చేశారు. పోలీసు విధుల్లో ఎదురయ్యే ఒత్తిడిని సమర్థవంతంగా ఎదుర్కోవడం, మానసిక స్థైర్యం పెంపొందించుకోవడం, క్రమశిక్షణతో విధులు నిర్వహించడం వంటి అంశాలపై ఆయన ప్రసంగించారు.
ఈ కార్యక్రమంలో ఒంగోలు పి.టి.సి ప్రిన్సిపల్ శ్రీమతి జి.ఆర్. రాధిక ఐపిఎస్, వైస్ ప్రిన్సిపల్ శ్రీ డి. లక్ష్మణ కుమార్, డి.టి.సి వైస్ ప్రిన్సిపల్ శ్రీ గురునాథ్ బాబు పాల్గొన్నారు. ఇంపాక్ట్ ఫౌండేషన్ ట్రైనర్లు డా. కె.టి.సి పాపారాయుడు, వెంకట్ గార్లు అభ్యర్థులకు శిక్షణ అందించారు. ఈ శిక్షణ పోలీసు అభ్యర్థుల్లో ఆత్మవిశ్వాసం, నైతిక విలువలు పెంపొందించిందని నిర్వాహకులు తెలిపారు.



