Contact Us Latest News
True news. Fast information. Andhra Pradesh • Telangana • National
Author Panel
Visakhapatnam

పోలింగ్ కేంద్రాల పరిధిలో నివాసితులకు గాజువాక పోలీసుల నోటీసులు ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా అప్రమత్తత.. అనుమానా

Punnami Newsroom Published:
పోలింగ్ కేంద్రాల పరిధిలో నివాసితులకు గాజువాక పోలీసుల నోటీసులు ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా అప్రమత్తత.. అనుమానా

విశాఖపట్నం, అక్టోబర్ 24 (పున్నమి ప్రతినిధి): జీవీఎంసీ ఎన్నికల నేపథ్యంలో నవంబర్ 1న జరగనున్న పోలింగ్‌ను ప్రశాంతంగా నిర్వహించేందుకు గాజువాక పోలీసులు చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా గాజువాక పోలీస్‌స్టేషన్‌ పరిధిలో పోలింగ్‌ కేంద్రాలకు 100 మీటర్ల పరిధిలో నివసించే ఇళ్ల యజమానులు, నివాసితులకు నోటీసులు జారీ చేశారు.

ఎన్నికల సమయంలో అపరిచితులకు ఆశ్రయం కల్పించరాదని, అనుమానాస్పద వ్యక్తుల కదలికలు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు. ఓటర్లను ప్రలోభపెట్టే చర్యలకు దూరంగా ఉండాలని, ఎన్నికల నియమ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని స్పష్టం చేశారు.

ఎన్నికల సమయంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని గాజువాక పోలీసులు కోరారు. శాంతిభద్రతల పరిరక్షణకు పోలీస్‌శాఖకు సహకరిస్తూ పోలింగ్‌ స్వేచ్ఛగా, ప్రశాంతంగా, నిష్పక్షపాతంగా జరిగేలా బాధ్యతాయుతంగా వ్యవహరించాలని విజ్ఞప్తి చేశారు.

పోలింగ్ కేంద్రాల పరిధిలో నివాసితులకు గాజువాక పోలీసుల నోటీసులు ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా అప్రమత్తత.. అనుమానా

Leave a comment

Your email address will not be published. Required fields are marked *