Wednesday, 1 April 2026
  • Home  
  • పోలవరం – ఏలూరు కాలువ అనుసంధానానికి నిధులు మంజూరు చేయాలి : యార్లగడ్డ
- E-పేపర్

పోలవరం – ఏలూరు కాలువ అనుసంధానానికి నిధులు మంజూరు చేయాలి : యార్లగడ్డ

గన్నవరం : నియోజవర్గం (పున్నమి ప్రతినిధి) పోలవరం కుడికాలువ ను ఏలూరు కాలువతో అనుసంధానానికి నిధులు మంజూరు చేయాలని ప్రభుత్వ విప్ గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు ప్రభుత్వాన్ని కోరారు. రాష్ట్ర శాసనసభ వర్షాకాల సమావేశాల్లో భాగంగా బుధవారం జరిగిన సమావేశంలో యార్లగడ్డ మాట్లాడుతూ పోలవరం కుడి కాలువ నీరు ప్రకాశం బ్యారేజీ వరకు వెళ్లి తిరిగి ఏలూరు కాలువ ద్వారా బాపులపాడు మండలానికి రావడానికి సుమారు 50 కిలోమీటర్ల దూరం ప్రయాణం చేయాల్సి వస్తుందని, ఈ రెండు కాలువలను బాపులపాడు మండలంలో ని అంపాపురం వద్ద అనుసంధానం చేస్తే కాలువ చివరి గ్రామాలకు సాగునీటి కొరత తీరుతుందన్నారు. ఈ అనుసంధానానికి గతంలో టిడిపి ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు రూ.15.60 కోట్ల నిధులు మంజూరు చేసినా వివిధ కారణాలతో పనులు ప్రారంభం కాలేదన్నారు. ఈ పనులకు తక్షణమే నిధులు మంజూరు చేయాలని కోరారు. గత సంవత్సరం వచ్చిన వరదల కారణంగా బుడమేరు కు 39 చోట్ల గండ్లు పడితే వాటిని పూడ్చేందుకు రూ. 9 కోట్లు నిధులు మంజూరు చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కు ఎమ్మెల్యే ధన్యవాదాలు తెలిపారు. 2008వ సంవత్సరం నున్న గ్రామంలో 3.50 ఎకరాల భూమిని జర్నలిస్ట్ కాలనీ కి కేటాయించగా ఆక్రమణలపాలై ప్రస్తుతం 2.50 ఎకరాలు మాత్రమే ఉందని ప్రభుత్వం వెంటనే స్పందించి ఈ కాలనీ లో జర్నలిస్టులకు ఇళ్ళు నిర్మించి ఇవ్వాలని కోరారు. రాష్ట్ర వ్యాప్తంగా పేద ప్రజలకు పట్టణాల్లో రెండు సెంట్లు గ్రామాల్లో మూడు సెంట్లు చొప్పున ఇచ్చేందుకు ప్రభుత్వం నిర్ణయించిందని జర్నలిస్టులకు ఒక సెంటు అదనంగా ఇవ్వాలని గత అసెంబ్లీ సమావేశాల్లో తన కోరగా స్పందించిన మంత్రి పార్థసారథి కమిటీని ఏర్పాటు చేశారని సాధ్యమైనంత త్వరలో జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు కేటాయించాలని యార్లగడ్డ విజ్ఞప్తి చేశారు. అసెంబ్లీ సమావేశాల్లో జీరో అవర్ లో ప్రస్తావిస్తున్న అంశాలకు సంబంధించి ఎమ్మెల్యేలకు తిరుగు సమాచారం ఇవ్వటం లేదని దీనివల్ల తాము ప్రస్తావించిన అంశాలు ఏ స్టేజిలో ఉన్నాయో తెలుసుకునేందుకు వీలు లేకకుండాపోతుందన్నారు. జీరో వరకు తగిన ప్రాముఖ్యత నివ్వాలని ఎమ్మెల్యే లు లేవనెత్తిన సమస్యలపై అధికారులు సంబంధిత ఎమ్మెల్యేలకు సమాచారం ఇచ్చే విధంగా ఆదేశించాలని వెంకట్రావు సభాపతి స్థానంలో ఉన్న మండలి బుద్ధ ప్రసాద్ ను కోరారు.

గన్నవరం : నియోజవర్గం (పున్నమి ప్రతినిధి)
పోలవరం కుడికాలువ ను ఏలూరు కాలువతో అనుసంధానానికి నిధులు మంజూరు చేయాలని ప్రభుత్వ విప్ గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు ప్రభుత్వాన్ని కోరారు. రాష్ట్ర శాసనసభ వర్షాకాల సమావేశాల్లో భాగంగా బుధవారం జరిగిన సమావేశంలో యార్లగడ్డ మాట్లాడుతూ పోలవరం కుడి కాలువ నీరు ప్రకాశం బ్యారేజీ వరకు వెళ్లి తిరిగి ఏలూరు కాలువ ద్వారా బాపులపాడు మండలానికి రావడానికి సుమారు 50 కిలోమీటర్ల దూరం ప్రయాణం చేయాల్సి వస్తుందని, ఈ రెండు కాలువలను బాపులపాడు మండలంలో ని అంపాపురం వద్ద అనుసంధానం చేస్తే కాలువ చివరి గ్రామాలకు సాగునీటి కొరత తీరుతుందన్నారు. ఈ అనుసంధానానికి గతంలో టిడిపి ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు రూ.15.60 కోట్ల నిధులు మంజూరు చేసినా వివిధ కారణాలతో పనులు ప్రారంభం కాలేదన్నారు. ఈ పనులకు తక్షణమే నిధులు మంజూరు చేయాలని కోరారు. గత సంవత్సరం వచ్చిన వరదల కారణంగా బుడమేరు కు 39 చోట్ల గండ్లు పడితే వాటిని పూడ్చేందుకు రూ. 9 కోట్లు నిధులు మంజూరు చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కు ఎమ్మెల్యే ధన్యవాదాలు తెలిపారు. 2008వ సంవత్సరం నున్న గ్రామంలో 3.50 ఎకరాల భూమిని జర్నలిస్ట్ కాలనీ కి కేటాయించగా ఆక్రమణలపాలై ప్రస్తుతం 2.50 ఎకరాలు మాత్రమే ఉందని ప్రభుత్వం వెంటనే స్పందించి ఈ కాలనీ లో జర్నలిస్టులకు ఇళ్ళు నిర్మించి ఇవ్వాలని కోరారు. రాష్ట్ర వ్యాప్తంగా పేద ప్రజలకు పట్టణాల్లో రెండు సెంట్లు గ్రామాల్లో మూడు సెంట్లు చొప్పున ఇచ్చేందుకు ప్రభుత్వం నిర్ణయించిందని జర్నలిస్టులకు ఒక సెంటు అదనంగా ఇవ్వాలని గత అసెంబ్లీ సమావేశాల్లో తన కోరగా స్పందించిన మంత్రి పార్థసారథి కమిటీని ఏర్పాటు చేశారని సాధ్యమైనంత త్వరలో జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు కేటాయించాలని యార్లగడ్డ విజ్ఞప్తి చేశారు. అసెంబ్లీ సమావేశాల్లో జీరో అవర్ లో ప్రస్తావిస్తున్న అంశాలకు సంబంధించి ఎమ్మెల్యేలకు తిరుగు సమాచారం ఇవ్వటం లేదని దీనివల్ల తాము ప్రస్తావించిన అంశాలు ఏ స్టేజిలో ఉన్నాయో తెలుసుకునేందుకు వీలు లేకకుండాపోతుందన్నారు. జీరో వరకు తగిన ప్రాముఖ్యత నివ్వాలని ఎమ్మెల్యే లు లేవనెత్తిన సమస్యలపై అధికారులు సంబంధిత ఎమ్మెల్యేలకు సమాచారం ఇచ్చే విధంగా ఆదేశించాలని వెంకట్రావు సభాపతి స్థానంలో ఉన్న మండలి బుద్ధ ప్రసాద్ ను కోరారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.