*✍️”పోతురాజు” వారి పెట్రోల్ బంక్ ప్రారంభోత్సవంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న బత్యాల
*ఈరోజు 23-10-2025 తేది గురువారం నాడు రైల్వేకోడూరు పట్టణం మద్రాస్ రోడ్డులో సిద్దేశ్వర థియేటర్ ఎదురుగా తన మిత్రుడు పోతురాజు అమరేంద్ర గారి “నయారా పెట్రోల్ బంక్” ప్రారంభోత్సవానికి ముఖ్యఅతిథిగా విచ్చేసి వారిని వారి కుటుంబసభ్యులను ఆశీర్వదించిన మాజీ ఎమ్మెల్యే, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గౌరవ,,శ్రీ బత్యాల చంగల్ రాయుడు గారు.*
*ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కస్టమర్ల మన్నలను పొంది ఆ దేవదేవుడు శ్రీ కలియుగ వెంకటేశ్వర స్వామి వారి ఆశీస్సులతో దినదినాభివృద్ధి చెందాలని ఆకాంక్షిస్తున్నట్లుగా తెలిపారు………., ఈ కార్యక్రమంలో అమరేంద్ర గారి కుమారులు పోతురాజు నవీన్, పోతురాజు సుమన్ మరియు టీడీపీ నేతలు మాజీ ఉప సర్పంచ్ నార్జాల హేమరాజ్, శ్రీకారం శివయ్య, సురేష్ యాదవ్ ఇంకా తదితరులు పాల్గొన్నారు.*


