Sunday, 22 March 2026
  • Home  
  • పోతుగుంట రమేష్ నాయుడుకు ఘన సత్కారం శివయ్య సేవ లభించడం పూర్వజన్మ సుకృతం — రమేష్ నాయుడు
- అన్నమయ్య

పోతుగుంట రమేష్ నాయుడుకు ఘన సత్కారం శివయ్య సేవ లభించడం పూర్వజన్మ సుకృతం — రమేష్ నాయుడు

శ్రీశైల భ్రమరాంబిక మల్లికార్జున స్వామి దేవస్థానం చైర్మన్ పోతుగుంట రమేష్ నాయుడుకు నందలూరు మండల సర్పంచుల సంఘం తరఫున ఆదివారం ఘన సత్కారం లభించింది. నందలూరు మండల సర్పంచుల సంఘం అధ్యక్షులు,నాగిరెడ్డిపల్లి మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్ జంబు సూర్యనారాయణ ఆధ్వర్యంలో రాజంపేట మండలం వైబియాన్ పల్లెలోని చైర్మన్ రమేష్ నాయుడు స్వగృహంలో ఈ సన్మానం నిర్వహించారు.ఈ సందర్భంగా సర్పంచ్ సూర్యనారాయణ మాట్లాడుతూ,అనేక సంవత్సరాలుగా పోతుగుంట రమేష్ నాయుడు సమాజ సేవతో పాటు భారతీయ జనతా పార్టీలో విశిష్ట సేవలు అందించారు. ఆయనకు శ్రీశైలం దేవస్థానం చైర్మన్ పదవి దక్కడం ఆయన చేసిన సేవలకు ప్రతిఫలం.శివయ్య సేవకుడిగా ఈ పదవి లభించడం ఆయన అదృష్టం,” అని అన్నారు.అలాగే, చైర్మన్ బాధ్యతలు స్వీకరించిన వెంటనే టిటిడీ నుండి శ్రీశైలం అభివృద్ధికి ₹25 కోట్ల రూపాయలు తీసుకురావడాన్ని శుభపరిణామంగా అభివర్ణించారు.కూటమి ప్రభుత్వ సహకారంతో ఆలయం అన్ని విధాల అభివృద్ధి చెందే అవకాశం ఉందని పేర్కొన్నారు. భవిష్యత్‌లో రమేష్ నాయుడు మరిన్ని ఉన్నత పదవులు అలంకరించాలని దేవుడిని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. చైర్మన్ పోతుగుంట రమేష్ నాయుడు మాట్లాడుతూ, శ్రీశైలం లాంటి మహోన్నత క్షేత్రానికి క్షేత్రపాలకుడిగా సేవ చేసే అవకాశమొచ్చింది పూర్వజన్మ సుకృతం.శివయ్య దయతో ఆలయ అభివృద్ధికి శక్తివంచన లేకుండా కృషి చేసి మంచి పేరు తీసుకువస్తాను అని చెప్పారు.

శ్రీశైల భ్రమరాంబిక మల్లికార్జున స్వామి దేవస్థానం చైర్మన్ పోతుగుంట రమేష్ నాయుడుకు నందలూరు మండల సర్పంచుల సంఘం తరఫున ఆదివారం ఘన సత్కారం లభించింది. నందలూరు మండల సర్పంచుల సంఘం అధ్యక్షులు,నాగిరెడ్డిపల్లి మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్ జంబు సూర్యనారాయణ ఆధ్వర్యంలో రాజంపేట మండలం వైబియాన్ పల్లెలోని చైర్మన్ రమేష్ నాయుడు స్వగృహంలో ఈ సన్మానం నిర్వహించారు.ఈ సందర్భంగా సర్పంచ్ సూర్యనారాయణ మాట్లాడుతూ,అనేక సంవత్సరాలుగా పోతుగుంట రమేష్ నాయుడు సమాజ సేవతో పాటు భారతీయ జనతా పార్టీలో విశిష్ట సేవలు అందించారు. ఆయనకు శ్రీశైలం దేవస్థానం చైర్మన్ పదవి దక్కడం ఆయన చేసిన సేవలకు ప్రతిఫలం.శివయ్య సేవకుడిగా ఈ పదవి లభించడం ఆయన అదృష్టం,” అని అన్నారు.అలాగే, చైర్మన్ బాధ్యతలు స్వీకరించిన వెంటనే టిటిడీ నుండి శ్రీశైలం అభివృద్ధికి ₹25 కోట్ల రూపాయలు తీసుకురావడాన్ని శుభపరిణామంగా అభివర్ణించారు.కూటమి ప్రభుత్వ సహకారంతో ఆలయం అన్ని విధాల అభివృద్ధి చెందే అవకాశం ఉందని పేర్కొన్నారు. భవిష్యత్‌లో రమేష్ నాయుడు మరిన్ని ఉన్నత పదవులు అలంకరించాలని దేవుడిని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు.
చైర్మన్ పోతుగుంట రమేష్ నాయుడు మాట్లాడుతూ,
శ్రీశైలం లాంటి మహోన్నత క్షేత్రానికి క్షేత్రపాలకుడిగా సేవ చేసే అవకాశమొచ్చింది పూర్వజన్మ సుకృతం.శివయ్య దయతో ఆలయ అభివృద్ధికి శక్తివంచన లేకుండా కృషి చేసి మంచి పేరు తీసుకువస్తాను అని చెప్పారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.