రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలంలోని పోతుగల్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ప్రభుత్వం చేపట్టిన ‘ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక’ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలకు ప్రభుత్వ ఆరోగ్య సేవలు, అభివృద్ధి కార్యక్రమాలపై అవగాహన కల్పించారు.
ఈ కార్యక్రమంలో పోతుగల్ గ్రామ సర్పంచ్ పెద్దిగారి యాదమ్మ , ఉప సర్పంచ్ కోల కృష్ణ, డాక్టర్ ఆఫీజ వార్డు సభ్యులు పాల్గొన్నారు. అలాగే మెడికల్ ఆఫీసర్లు, స్టాఫ్ నర్సులు, ఆశా వర్కర్లు, హాస్పిటల్ సిబ్బంది మరియు వివిధ గ్రామాల ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.
ఈ సందర్భంగా అధికారులు ప్రజలకు ప్రభుత్వ పథకాల గురించి వివరించి, ఆరోగ్య సేవలను సమర్థంగా వినియోగించుకోవాలని సూచించారు. గ్రామ అభివృద్ధికి ప్రజల భాగస్వామ్యం ఎంతో అవసరమని తెలిపారు.


