Thursday, 26 March 2026
  • Home  
  • పోక్సో చట్టానికి స్త్రీ పురుషులనే వివక్ష లేదు
- క్రైమ్

పోక్సో చట్టానికి స్త్రీ పురుషులనే వివక్ష లేదు

ఆగస్టు 21 పున్నమి ప్రతినిధి @ లైంగిక వేధింపులకు పాల్పడితే ఎవరైనా శిక్ష అనుభవించాల్సిందే. పోక్సో చట్టంపై స్పష్టతనిచ్చిన కర్ణాటక హైకోర్టు. కర్ణాటకలో 13 ఏళ్ల బాలుడిపై లైంగిక వేధింపులకు పాల్పడ్డ 48 ఏళ్ల ఉపాధ్యాయురాలిపై పోక్సో కేసు నమోదు చేసిన పోలీసులు. తనపై నమోదైన పోక్సో కేసును కొట్టివేయాలని కర్ణాటక హైకోర్టును ఆశ్రయించిన మహిళ. ఈ కేసు విచారిస్తూ పోక్సో చట్టానికి లింగ వివక్ష ఉండదని, నేరం చేసింది పురుషులైనా, మహిళలైనా సమాన శిక్ష అనుభవించాల్సిందేనని స్పష్టం చేసిన కర్ణాటక హైకోర్టు జస్టిస్ ఎం.నాగప్రసన్న. దేశంలో లైంగిక వేధింపులకు గురవుతున్న వారిలో 54.4% బాలురు, 46.6% బాలికలు ఉంటున్నారని పేర్కొన్న హైకోర్టు న్యాయమూర్తి. ఐపీసీలోని అత్యాచార చట్టం తరహాలోని కేవలం పురుషులని మాత్రమే నిందితులుగా నిర్ధారించాలని కోరిన నిందితురాలి తరపు న్యాయవాది. ఈ వాదనను తిరస్కరిస్తూ పోక్సో కేసులో లైంగిక వేధింపులు అనేది ఐపీసీలో అత్యాచారం లాంటిది కాదని స్పష్టం చేసిన న్యాయమూర్తి. తగిన ఆధారాలు సేకరించి నిందితురాలికి వెంటనే శిక్ష విధించాలని ట్రయల్ కోర్టును ఆదేశించిన కర్ణాటక హైకోర్టు.

ఆగస్టు 21 పున్నమి ప్రతినిధి @
లైంగిక వేధింపులకు పాల్పడితే ఎవరైనా శిక్ష అనుభవించాల్సిందే.
పోక్సో చట్టంపై స్పష్టతనిచ్చిన కర్ణాటక హైకోర్టు.
కర్ణాటకలో 13 ఏళ్ల బాలుడిపై లైంగిక వేధింపులకు పాల్పడ్డ 48 ఏళ్ల ఉపాధ్యాయురాలిపై పోక్సో కేసు నమోదు చేసిన పోలీసులు.
తనపై నమోదైన పోక్సో కేసును కొట్టివేయాలని కర్ణాటక హైకోర్టును ఆశ్రయించిన మహిళ.
ఈ కేసు విచారిస్తూ పోక్సో చట్టానికి లింగ వివక్ష ఉండదని, నేరం చేసింది పురుషులైనా, మహిళలైనా సమాన శిక్ష అనుభవించాల్సిందేనని స్పష్టం చేసిన కర్ణాటక హైకోర్టు జస్టిస్ ఎం.నాగప్రసన్న.
దేశంలో లైంగిక వేధింపులకు గురవుతున్న వారిలో 54.4% బాలురు, 46.6% బాలికలు ఉంటున్నారని పేర్కొన్న హైకోర్టు న్యాయమూర్తి.
ఐపీసీలోని అత్యాచార చట్టం తరహాలోని కేవలం పురుషులని మాత్రమే నిందితులుగా నిర్ధారించాలని కోరిన నిందితురాలి తరపు న్యాయవాది.
ఈ వాదనను తిరస్కరిస్తూ పోక్సో కేసులో లైంగిక వేధింపులు అనేది ఐపీసీలో అత్యాచారం లాంటిది కాదని స్పష్టం చేసిన న్యాయమూర్తి.
తగిన ఆధారాలు సేకరించి నిందితురాలికి వెంటనే శిక్ష విధించాలని ట్రయల్ కోర్టును ఆదేశించిన కర్ణాటక హైకోర్టు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.