పొలం పిలుస్తుంది కార్యక్రమం – కలువాయి, తెలుగురాయపురంలో విజృంభణ
కలువాయి, జూన్ 25 (పున్నమి ప్రతినిధి):
కలువాయి మండలంలో “పొలం పిలుస్తుంది” కార్యక్రమం జూన్ 25న తెలుగురాయపురం మరియు కలువాయి గ్రామాల్లో నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ శాఖ అధికారుల ఆధ్వర్యంలో రైతులకు వివిధ అంశాలపై అవగాహన కల్పించారు.
రైతులతో చర్చిస్తూ అన్నదాత సుఖీభవ, సాయిల్ శాంపిల్స్, మండలంలోని ఫైళ్ల స్థితిగతులు, వాటి యాజమాన్య పద్ధతులు వంటి విషయాలపై వివరించడంతో పాటు, తగిన సలహాలు, సూచనలు అందించారు. యూరియా ఎరువుల కొరత లేకుండా చూడనున్నట్టు అధికారులూ హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో వ్యవసాయ అధికారి శ్రీమతి సిహెచ్. కళారాణి గారు, వ్యవసాయ శాఖ సిబ్బంది పాల్గొన్నారు. రైతుల్లో చైతన్యం కలిగించేలా ఈ కార్యక్రమం సాగింది.