*పొదలకూరులో హోటళ్లపై ఫుడ్ సేఫ్టీ అధికారుల ఆకస్మిక దాడులు*
పొదలకూరు పున్నమి ప్రతినిధి:
పొదలకూరు పట్టణంలోని పలు హోటళ్లలో మంగళవారం జిల్లా ఫుడ్ సేఫ్టీ అధికారి ప్రణుతి ఫ్లోరా మంగళవారం పట్టణంలోని పలు బేకరీలను, స్వీట్ షాపులు హోటల్స్ ను ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. వీటిలో నుంచి రెండు శాంపిల్స్ సేకరించి ఎనాలసిస్ పంపినట్లు ఆమె తెలిపారు. ఆహార భద్రతా ప్రమాణాలు, పరిశుభ్రత, వంటశాలల స్థితి, నిల్వ గదులు, వాడుతున్న నూనెల నాణ్యత, పాత్రల పరిశుభ్రత వంటి అంశాలను పరిశీలించారు. గడువు ముగిసిన పదార్థాలు వినియోగిస్తున్న కొన్ని హోటళ్లను గుర్తించి యాజమాన్యాలకు నోటీసులు జారీ చేశారు. పరిశుభ్రత లోపాలున్న చోట్ల కఠిన హెచ్చరికలు ఇచ్చారు. అనుమతి లేని కలర్ పౌడర్లు, కెమికల్స్ వినియోగం. లైసెన్స్ లేకుండా నడుస్తున్న కొన్ని హోటళ్లు. వినియోగదారుల ఆరోగ్య భద్రతను నిర్లక్ష్యం చేస్తే కేసులు నమోదు చేస్తామని స్పష్టం చేశారు.


