*పొదలకూరులో స్మార్ట్ కార్డులు పంపిణీ..*
ముఖ్యఅతిథిగా పాల్గొన్న టీడీపీ మండల అధ్యక్షుడు తలచీరు మస్తాన్ బాబు…
*పొదలకూరు ఆగష్టు పున్నమి ప్రతినిధి* : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన స్మార్ట్ రైస్ కార్డు పంపిణీ కార్యక్రమంలో సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆదేశాల మేరకు పొదలకూరు తాసిల్దార్ కార్యాలయంలో స్మార్ట్ రేషన్ కార్డు పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా పొదలకూరు మండల అధ్యక్షుడు తలచిరు మస్తాన్ బాబు, పట్టణ అధ్యక్షుడు బొద్దులూరి మల్లికార్జున్ నాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మండల అధ్యక్షుడు మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో తుగ్లక్ ఆలోచనతో గత ప్రభుత్వం అందించిన రేషన్ కార్డులపై ఆ పార్టీ రంగులు ముఖ్యమంత్రి ఫోటోలు వేసుకొని రేషన్ కార్డులు పంపిణీ చేయడం జరిగిందని, ఇప్పటి టిడిపి ప్రభుత్వంలో అందజేస్తున్నటువంటి రేషన్ స్మార్ట్ కార్డులు ద్వారా ఎక్కడికి వెళ్ళినా కార్డు మీద ఉన్న క్యూఆర్ కోడ్ తో ఫోన్లో స్కాన్ చేయగా లబ్ధిదారుల వివరాలు తెలుసుకునే విధంగా ఈ స్మార్ట్ కార్డులు రూపొందించారని తెలిపారు. ప్రతి లబ్ధిదారునికి ఈ స్మార్ట్ రేషన్ కార్డును బాధ్యతగా అందజేయడం జరుగుతుందని తెలిపారు. అనంతరం లబ్ధిదారులకు స్మార్ట్ కార్డులను అందజేశారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు బక్కయ్య నాయుడు, సివిల్ సప్లై డిటి రవి, డిప్యూటీ తహసిల్దార్ సురేఖ, వీఆర్వో నాగమ్మ, అధికారులు లబ్ధిదారులు పాల్గొన్నారు..


