Wednesday, 30 July 2025
  • Home  
  • పొత్తుల పార్టీల వారు చిత్తు కావడం ఖాయం*. ఎమ్మెల్యే మేకపాటి*
- ఆంధ్రప్రదేశ్

పొత్తుల పార్టీల వారు చిత్తు కావడం ఖాయం*. ఎమ్మెల్యే మేకపాటి*

*జగన్ పాలనలో రాష్ట్రం సుభిక్షం* *: పేదల బతుకు మారింది వైఎస్సార్సీపీ వల్లే* *: పొత్తుల పార్టీల వారు చిత్తు కావడం ఖాయం* *: కరటంపాడులో ఎన్నికల ప్రచారం నిర్వహించిన ఎమ్మెల్యే మేకపాటి* *: ఇఫ్తార్ విందులో పాల్గొన్న ఎమ్మెల్యే మేకపాటి* *మర్రిపాడు: ఏప్రిల్ (పున్నమి ప్రతినిది)* రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రజాసంక్షేమ పాలన అందించాలని, ఐదేళ్ల పాలనలో రాష్ట్రం సుభిక్షంగా ఉందని, ఇలాగే కొనసాగాలంటే మళ్లీ ప్రజలంతా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని గెలిపించాలని ఆత్మకూరు ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి అన్నారు. ఆదివారం ఆత్మకూరు మండలం కరటంపాడు, సాతానుపల్లి గ్రామాలలో ఎమ్మెల్యే మేకపాటి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామానికి విచ్చేసిన ఎమ్మెల్యే మేకపాటికి స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయా ప్రాంతాలకు వెళ్లిన ఎమ్మెల్యే మేకపాటి ప్రతి ఒక్కరిని ఆప్యాయంగా పలకరించారు. గడచిన ఐదేళ్లలో జగనన్న అందించిన సుభిక్ష పాలనను ప్రజలకు వివరించి మళ్లీ ఒక్కసారి అవకాశం ఇస్తే ఆ సంక్షేమ పథకాలు అమలు చేయడంతో పాటు మరిన్ని ప్రజా ఉపయోగకరమైన పనులు చేపడుతారని అన్నారు. ఐదేళ్లుగా ప్రతి నెలా ఒకటో తేదినే పించను అందించామని, దీనిని జీర్ణించుకోలేక ప్రతిపక్ష పార్టీలు వాలంటీర్ల వ్యవస్థ సేవలను అడ్డుకుని పించన్ దారులను కష్టాలకు గురిచేశారన్నారు. ప్రతి గ్రామాన్ని అభివృద్ది చేసుకునేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సంక్షేమ పథకాలను అందచేశారని, ఒక్క కరటంపాడు పంచాయతీ పరిధిలోని రూ.12.63కోట్ల మేర డీబీటీ, నాన్ డీబీటీ పథకాల ద్వారా అందచేయడం జరిగిందని వివరించారు. గడప గడపకు మన ప్రభుత్వం ద్వారా రూ.22 లక్షలు అందచేయఢం జరిగిందని అన్నారు. పంచాయతీ పరిధిలో 171 మంది రైతులకు సంబంధించిన సుమారు 140 ఎకరాలకు సంబంధించి భూ సమస్యలను పరిష్కరించడం జరిగిందని వివరించారు. గత ఐదేళ్ల కాలంలో జగనన్న ఇంతటి సంక్షేమాన్ని అందించారని, రానున్న రోజుల్లో కరటంపాడు పంచాయతీకి చేయబోయే పనులను సైతం ఇప్పుడే తెలుపుతున్నామని అన్నారు. కమ్యూనిటి హాల్ నిర్మాణం, సెంట్రల్ లైటింగ్, బస్ షెల్టర్ ఏర్పాటుతో పాటు పంట కాలువకు సిమెంట్ కాంక్రీట్ నిర్మాణం, శ్మశానానికి మౌళిక సదుపాయాలు కల్పిస్తామని అన్నారు. గ్రామంలో మిగిలి ఉన్న అభివృద్ది పనులన్నింటిని పూర్తి చేస్తామని వివరించారు. సంక్షేమ సారధి జగనన్నను ఎదుర్కొనేందుకు ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ ఒక్కటే పోటి చేయలేక ఒక సినిమా యాక్టర్ ను ముందు తీసుకొచ్చారని, అతనితో కూడా పనికాదని తెలుసుకుని ఢిల్లీకి పరుగెత్తి టిక్కెట్లు అందించి మరీ పొత్తులు పెట్టుకున్నారని, ఇలా పార్టీల పొత్తులతో పడి ప్రజలతో పొత్తు మరచిపోయారని, వారిని ప్రజలందరూ చిత్తుగా ఓడించడం ఖాయమన్నారు. సంక్షేమాభివృద్ది కోసం జగనన్న ప్రజలతో పొత్తు పెట్టుకున్నారని, రానున్న ఎన్నికల్లో 175 స్థానాల్లో పోటి చేస్తున్న వైఎస్సార్సీపీ అభ్యర్థులను ప్రజలు గెలిపించాలన్నారు. ప్రజలే ఆయన వారధులుగా మారి మరోమారు సారధ్య బాధ్యతలు అప్పగించాలని అన్నారు. ఈ సందర్భంగా పలువురు వైఎస్సార్సీపీలో చేరడంతో వారిని పార్టీ కండువా కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వనించారు. అనంతరం కరటంపాడులోని మస్జీదే అక్సాలో ముస్లీం సోదరులతో కలసి ఇఫ్తార్ విందులో పాల్గొన్న ఎమ్మెల్యే మేకపాటి తొలుత ప్రత్యేక దువా కార్యక్రమంలో పాల్గొన్నారు. పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా ముస్లీం సోదరులతో కలసి ఇఫ్తార్ విందులో పాల్గొనడం చాలా ఆనందంగా ఉందని, ముస్లీం సోదరులకు ముందస్తుగానే రంజాన్ మాస శుభాకాంక్షలు తెలుపుతున్నామని అన్నారు.

  1. *జగన్ పాలనలో రాష్ట్రం సుభిక్షం*
    *: పేదల బతుకు మారింది వైఎస్సార్సీపీ వల్లే*
    *: పొత్తుల పార్టీల వారు చిత్తు కావడం ఖాయం*
    *: కరటంపాడులో ఎన్నికల ప్రచారం నిర్వహించిన ఎమ్మెల్యే మేకపాటి*
    *: ఇఫ్తార్ విందులో పాల్గొన్న ఎమ్మెల్యే మేకపాటి*

*మర్రిపాడు: ఏప్రిల్ (పున్నమి ప్రతినిది)*

రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రజాసంక్షేమ పాలన అందించాలని, ఐదేళ్ల పాలనలో రాష్ట్రం సుభిక్షంగా ఉందని, ఇలాగే కొనసాగాలంటే మళ్లీ ప్రజలంతా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని గెలిపించాలని ఆత్మకూరు ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి అన్నారు.
ఆదివారం ఆత్మకూరు మండలం కరటంపాడు, సాతానుపల్లి గ్రామాలలో ఎమ్మెల్యే మేకపాటి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామానికి విచ్చేసిన ఎమ్మెల్యే మేకపాటికి స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయా ప్రాంతాలకు వెళ్లిన ఎమ్మెల్యే మేకపాటి ప్రతి ఒక్కరిని ఆప్యాయంగా పలకరించారు.
గడచిన ఐదేళ్లలో జగనన్న అందించిన సుభిక్ష పాలనను ప్రజలకు వివరించి మళ్లీ ఒక్కసారి అవకాశం ఇస్తే ఆ సంక్షేమ పథకాలు అమలు చేయడంతో పాటు మరిన్ని ప్రజా ఉపయోగకరమైన పనులు చేపడుతారని అన్నారు. ఐదేళ్లుగా ప్రతి నెలా ఒకటో తేదినే పించను అందించామని, దీనిని జీర్ణించుకోలేక ప్రతిపక్ష పార్టీలు వాలంటీర్ల వ్యవస్థ సేవలను అడ్డుకుని పించన్ దారులను కష్టాలకు గురిచేశారన్నారు.
ప్రతి గ్రామాన్ని అభివృద్ది చేసుకునేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సంక్షేమ పథకాలను అందచేశారని, ఒక్క కరటంపాడు పంచాయతీ పరిధిలోని రూ.12.63కోట్ల మేర డీబీటీ, నాన్ డీబీటీ పథకాల ద్వారా అందచేయడం జరిగిందని వివరించారు. గడప గడపకు మన ప్రభుత్వం ద్వారా రూ.22 లక్షలు అందచేయఢం జరిగిందని అన్నారు. పంచాయతీ పరిధిలో 171 మంది రైతులకు సంబంధించిన సుమారు 140 ఎకరాలకు సంబంధించి భూ సమస్యలను పరిష్కరించడం జరిగిందని వివరించారు. గత ఐదేళ్ల కాలంలో జగనన్న ఇంతటి సంక్షేమాన్ని అందించారని, రానున్న రోజుల్లో కరటంపాడు పంచాయతీకి చేయబోయే పనులను సైతం ఇప్పుడే తెలుపుతున్నామని అన్నారు.
కమ్యూనిటి హాల్ నిర్మాణం, సెంట్రల్ లైటింగ్, బస్ షెల్టర్ ఏర్పాటుతో పాటు పంట కాలువకు సిమెంట్ కాంక్రీట్ నిర్మాణం, శ్మశానానికి మౌళిక సదుపాయాలు కల్పిస్తామని అన్నారు. గ్రామంలో మిగిలి ఉన్న అభివృద్ది పనులన్నింటిని పూర్తి చేస్తామని వివరించారు.
సంక్షేమ సారధి జగనన్నను ఎదుర్కొనేందుకు ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ ఒక్కటే పోటి చేయలేక ఒక సినిమా యాక్టర్ ను ముందు తీసుకొచ్చారని, అతనితో కూడా పనికాదని తెలుసుకుని ఢిల్లీకి పరుగెత్తి టిక్కెట్లు అందించి మరీ పొత్తులు పెట్టుకున్నారని, ఇలా పార్టీల పొత్తులతో పడి ప్రజలతో పొత్తు మరచిపోయారని, వారిని ప్రజలందరూ చిత్తుగా ఓడించడం ఖాయమన్నారు.
సంక్షేమాభివృద్ది కోసం జగనన్న ప్రజలతో పొత్తు పెట్టుకున్నారని, రానున్న ఎన్నికల్లో 175 స్థానాల్లో పోటి చేస్తున్న వైఎస్సార్సీపీ అభ్యర్థులను ప్రజలు గెలిపించాలన్నారు. ప్రజలే ఆయన వారధులుగా మారి మరోమారు సారధ్య బాధ్యతలు అప్పగించాలని అన్నారు. ఈ సందర్భంగా పలువురు వైఎస్సార్సీపీలో చేరడంతో వారిని పార్టీ కండువా కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వనించారు.
అనంతరం కరటంపాడులోని మస్జీదే అక్సాలో ముస్లీం సోదరులతో కలసి ఇఫ్తార్ విందులో పాల్గొన్న ఎమ్మెల్యే మేకపాటి తొలుత ప్రత్యేక దువా కార్యక్రమంలో పాల్గొన్నారు. పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా ముస్లీం సోదరులతో కలసి ఇఫ్తార్ విందులో పాల్గొనడం చాలా ఆనందంగా ఉందని, ముస్లీం సోదరులకు ముందస్తుగానే రంజాన్ మాస శుభాకాంక్షలు తెలుపుతున్నామని అన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.