శ్రీకాకుళం : ప్రతి ఒక్కరూ పొగాకుతో తయారు చేసే వస్తువుల వ్యసనాలకు దూరంగా ఉండాలని కోరుతూ శ్రీకాకుళంలో రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో ఆదివారం ర్యాలీ నిర్వహించారు. ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈ కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్బంగా రెడ్ క్రాస్ ప్రతినిధులు సత్యనారాయణ, విజయ్ లు మాట్లాడుతూ పొగాకు వల్ల ప్రాణాంతకమైన కాన్సర్ వస్తుందని అన్నారు.