

ఆహారాన్ని వృధాచేయకండని, లయన్స్ క్లబ్ శ్రీకాకుళం సెంట్రల్ అధ్యక్షురాలు లయన్ డా.పైడి. సింధూర అన్నారు. ప్రపంచ ఆహారాన్ని దినోత్సవం సందర్భంగా స్థానిక సూర్యమహాల్ దగ్గరలో గల రిక్షా కార్మికులకు, దినసరి కూలీలకు, లయన్స్ క్లబ్ శ్రీకాకుళం సెంట్రల్ ఆధ్వర్యంలో అన్న ప్రసాదాన్ని అందించారు.
ఇందులో భాగముగా అధ్యక్షురాలు లయన్ డా. పైడి, సిందూర మాట్లాడుతూ ప్రపంచ ఆహారాన్ని దినోత్సవాన్ని పురస్కరించుకొని, జిల్లా ఎన్విరాన్మెంట్ చైర్మన్ లయన్ పొన్నాడ.రవికుమార్ సహకారంతో నగరంలో పలు చోట్ల, నిస్సహాయులకు ఆహారాన్ని అందించడం ఆనందంగా ఉందని, ఆకలి, పోషకాహార లోపం, ఆహార భద్రతపై అవగాహనను ప్రపంచవ్యాప్తంగా కల్పించడమే ప్రధాన లక్ష్యంగా ముందుకు వెళ్తున్నామన్నారు. మంచి జీవితం, మంచి భవిష్యత్తు కోసం..
ఆహారం అందించడమనే లక్ష్యంగా ఈ ఏడాది లయన్స్ క్లబ్ శ్రీకాకుళం సెంట్రల్ హంగర్ అంశం లో భాగంగా అన్నవితరణ కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని, గాలి, నీరు తర్వాత ప్రాథమిక అవసరమైనది ఆహారమేనని, ప్రపంచంలో బిలియన్లకు పైగా ప్రజలు ఆరోగ్యకరమైన ఆహారాన్ని పొందలేకపోతున్నారని, అనారోగ్యకరమైన ఆహారాన్ని తీసుకోవడం వల్ల పోషకాహార లోపం ఏర్పడుతుందన్నారు. జిల్లా ఎన్విరాన్మెంట్ చైర్మన్ లయన్ పొన్నాడ.రవికుమార్ మాట్లాడుతూ రైతులు ప్రపంచ జనాభా కంటే ఎక్కువ ఆహారాన్ని ఉత్పత్తి చేస్తున్నారని, కొరత మాత్రం అలాగే కొనసాగుతోందని, చాలామంది ఆకలితో అలమటిస్తున్నారన్నారు. వాతావరణంలో మార్పులు, ఆర్థికమాంద్యం, కొవిడ్ వంటి మహమ్మారుల సమయంలో ప్రపంచవ్యాప్తంగా ప్రజలు తీవ్రమైన ఆకలి సమస్యలను ఎదుర్కొన్నారని, ముఖ్యంగా ఇవి పేదలు, బలహీన వర్గాలను తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయన్నారు.
ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ శ్రీకాకుళం సెంట్రల్ ఉపాధ్యక్షులు డా.బోగెల.ఉమామహేశ్వర రావు, ఉర్లం.శివతేజ పట్నాయక్, కార్యదర్శి టెక్కం.రామ్ గోపాల్, సభ్యులు చౌదరి.శ్రీనివాస్, మానవత సంస్థ పూర్వపు కార్యదర్శి టి. శ్రీనివాస రావు, రిక్షా కార్మిక యూనియన్ సభ్యుల బృందం పాల్గొన్నారు.

