

03-06-2020మనుబోలు(పున్నమిప్రతినిధి)జట్లకొండూరు పంచాయతీ లోని కుడితిపల్లి గ్రామంలో సర్వేపల్లి శాసనసభ్యులు శ్రీ కాకాని గోవర్ధన్ రెడ్డి గారి సూచన మేరకు ఈ రోజు యర్రమాపు శరత్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో ఆరోగ్య శ్రీ కార్డులు పంపిణీ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిదులుగా మనుబోలు మండల మాజీ యం.పి.పి చేరెడ్డి రామిరెడ్డి వై.యెస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు బొమ్మిరెడ్డి హరగోపాల్ రెడ్డి పాల్గొన్నారు. నాయకులు మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి వై. ఎస్. జ గన్ మోహన్ రెడ్డి గారు ఆరోగ్యశ్రీలో విప్లవాత్మక మార్పులు తీసుకు వచ్చారు అన్నారు.కేన్సర్ వ్యాధినిఆరోగ్యశ్రీ పరధిలోకి తీసుకువచ్చారు
హైదరాబాద్, బెంగళూరు, చెన్నైలో కూడా ఆరోగ్యశ్రీ అమలు చేస్తున్నారు అన్నారు
దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారికి తోడుగా నిలిచారు
ప్రధానమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తికి బాగోలేకపోయినా.. మన ప్రభుత్వ ఆస్పత్రులకు వస్తే మంచి వైద్యం, మెడిసిన్ దొరుకుతాయని గర్వంగా చెప్పే పరిస్థితిని మన రాష్ట్రంలో తీసుకువచ్చారని పేదవాడు వైద్యం చేయించుకునేందుకు,పిల్లలను చదివించుకునేందుకు అప్పులపాలు కాకూడదని దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి బలంగా నమ్మారని, అందుకనే ఆరోగ్యశ్రీ, పథకానికి శ్రీకారం చుట్టారన్నారు. వై. యెస్. జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన ఏడాదికాలంలోనే ఆరోగ్యశ్రీ పథకానికి పునర్జీవం పోశరని వైద్య, ఆరోగ్య శాఖలో విప్లవాత్మక మార్పులు తీసుకు వచ్చి నారు అన్నారు.ఈ కార్యక్రమంలో వై.ఎస్.ఆర్.సి.పి విద్యార్థి విభాగం రాష్ట్ర కార్యదర్శి ఆవుల తులసి రామ్ యాదవ్, సోషల్ మీడియా ఇంచార్జ్ గుంజి రమేష్, పల్లంరెడ్డి రాజా రెడ్డి, మునగల వీరయ్య, ఉడత మధు ,బోయిన ఆది, వాలంటీర్లు మరియు గ్రామస్తులు పాల్గొన్నారు.

