*పేదల ప్రజల పాలిట వరంగా ముఖ్యమంత్రి సహాయనిధి…*
*బాధిత కుటుంబానికి రూ.2,50,000/-ల LOC కాపీనీ అందజేసిన ఎమ్మెల్యే నాగరాజు గారు..*
*ఆపధకాలంలో అండగా నిలిచిన ఎమ్మెల్యే నాగరాజు గారికి కృతజ్ఞతలు తెలిపిన గజ్జెలి నిరోషా కుటుంబ సభ్యులు..*
హైదరాబాద్ లోని ఎమ్మెల్యే క్వార్టర్స్ నందు నేడు హన్మకొండ జిల్లా ఐనవోలు మండలం పరిధిలోని నందనం గ్రామానికి చెందిన గజ్జెల్లి నిరోషా అనారోగ్య సమస్యతో బాధపడుతున్న క్రమంలో ముఖ్యమంత్రి సహాయనిధి ఎల్ఓసి నుంచి రూ.2,50,000 (2లక్షల 50 వేల రూపాయలు) ఎల్ఓసి కాపీనీ గౌరవ వర్ధన్నపేట నియోజకవర్గ శాసనసభ్యులు *శ్రీ కేఆర్ నాగరాజు* గారు ప్రత్యేక చొరతో హైదరాబాద్ నిమ్స్ ఆస్పత్రికి లో చికిత్స కోసం గజ్జెల్లి నిరోషా కుటుంబ సభ్యులకు LOC కాపీనీ అందజేశారు….
కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం నిరుపేదలకు వైద్య విషయంలో అన్ని విధాలుగా అండగా ఉంటుందని, స్థానిక శాసనసభ్యుడిగా నా దృష్టికి వచ్చిన అనారోగ్య సమస్యల పట్ల నా వంతు సహాయ సహకారం అందించే కృషి చేస్తానని తెలిపారు…
నా వర్ధన్నపేట నియోజకవర్గ ప్రజలందరికి విజ్ఞప్తి లక్షల రూపాయలతో ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొంది ఆసుపత్రిల దోపిడికి గురై అప్పుల పాలు కావద్దు విజ్ఞప్తి చేస్తూ ప్రభుత్వ నిమ్స్ హాస్పిటల్ వెళ్లి నేను ఇచ్చే ఎల్వోసీ ద్వారా ఉచిత చికిత్స పొందాలనీ ఈ సందర్భంగా ప్రజలకు ఎమ్మెల్యే నాగరాజు గారు విజ్ఞప్తి చేశారు…
ఈ సందర్బంగా గజ్జెల్లి నిరోషా గారి కుటుంబ సభ్యులు గారు ఎమ్మెల్యే నాగరాజు గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసి, తమ కృతజ్ఞత భావాన్ని చాటుకున్నారు…..


