నెల్లూరు 09.05.2020 ( పున్నమి ప్రతినిధి షేక్.ఉస్మాన్ అలీ✍️)
జిల్లాలో పేద కళాకారులకు అండగా ఉంటానని గంగాధర్ చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకుడు,నెల్లూరు జిల్లా కళాకారుల సంఘం అధ్యక్షుడు పిన్ను గంగాధర్ రెడ్డి పేర్కొన్నారు. శనివారం పేద కళాకారులకు వెయ్యి రూపాయల చొప్పున అమెదచేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..పేద కళాకారులను ఆదుకునేందుకు తన వంతు సహాయం ఎప్పుడూ ఉంటుంది అన్నారు.ఈ కార్యక్రమంలో రవీందర్ రెడ్డి పాల్గొన్నారు