Friday, 27 March 2026
  • Home  
  • పేదల సొంత యింటి కలలను సాకారం చేస్తున్న కూటమి ప్రభుత్వం ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్ తాతయ్య
- ఎన్ టి ఆర్ జిల్లా

పేదల సొంత యింటి కలలను సాకారం చేస్తున్న కూటమి ప్రభుత్వం ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్ తాతయ్య

జగ్గయ్యపేట నియోజకవర్గం లోని వత్సవాయి మండలం & గ్రామంలో బుధవారం జరిగిన PM–JANMAN గృహాల ప్రారంభోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో జగ్గయ్యపేట శాసనసభ్యులు శ్రీరాం రాజగోపాల్ తాతయ్య, ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీరాం తాతయ్య మాట్లాడుతూ: “పేదలకు సొంత ఇల్లు ఉండా లన్నది స్వర్గీయ నందమూరి తారక రామారావు మహాశయం. ఆ ఆశయాన్ని కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధితో అమలు చేస్తోంది,” అని అన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దూరదృష్టి, కూటమి ప్రభుత్వ చొరవతో కేవలం 17 నెలల్లోనే రాష్ట్రవ్యాప్తంగా 3 లక్షల గృహాలను పేదలకు మంజూరు చేయడం చారిత్రా త్మక ఘనతగా పేర్కొన్నారు. నియోజకవర్గ వ్యాప్తంగా సామూహిక గృహప్రవేశాలు జరుగుతున్నాయని తెలియ జేస్తూ, లబ్ధిదారులకు రాష్ట్ర ప్రభుత్వం 40 శాతం (₹1.50 లక్షలు), కేంద్ర ప్రభుత్వం 60 శాతం (₹2.50 లక్షలు) వాటా నిధులు మంజూరు చేస్తోందని తెలిపారు. బిల్లుల చెల్లింపులో ఎటువంటి జాప్యం లేకుండా చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. అంతకుముందు ప్రభుత్వ పాలనలో పేదల ఇల్లు విషయం లో ఇసుక కొరత సృష్టించి పేదలను ఇబ్బందులకు గురి చేసిన గత జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శిస్తూ, 2014–19లో మంజూరైన ఎన్టీఆర్ హౌసింగ్ లబ్ధిదారులకు రూ.920 కోట్లు చెల్లించకుండా నిలిపివేయడం పేదల పట్ల ద్రోహమని పేర్కొన్నారు. ప్రస్తుత కూటమి ప్రభుత్వం పేదలకు సౌకర్య వంతమైన గృహాలు అందించి, వారికీ ఆర్థిక భద్రత కల్పించే దిశగా ముందుకు సాగుతోందని చెప్పారు. నూతన గృహ ప్రవేశాలు చేసిన లబ్ధిదారులను ఆశీర్వదిస్తూ, “మీ కొత్త ఇళ్లలో సుఖసంతోషాలతో జీవించండి” అని ఎమ్మెల్యే ఆకాంక్షించారు. ఈ సందర్భంగా లబ్ధిదారులకు స్వీట్లు, దేవుని చిత్రపటాలు అందజేశారు. కార్యక్రమంలో పాల్గొన్న వారు: RDO బాలకృష్ణ, వత్సవాయి మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు వడ్లమూడి రాంబాబు, హౌసింగ్ పీడీ, స్థానిక తాసిల్దార్, అధికారులు,కూటమి నాయకులు, కార్యకర్తలు మరియు ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

జగ్గయ్యపేట నియోజకవర్గం లోని వత్సవాయి మండలం & గ్రామంలో బుధవారం జరిగిన PM–JANMAN గృహాల ప్రారంభోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో జగ్గయ్యపేట శాసనసభ్యులు శ్రీరాం రాజగోపాల్ తాతయ్య, ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీరాం తాతయ్య మాట్లాడుతూ: “పేదలకు సొంత ఇల్లు ఉండా లన్నది స్వర్గీయ నందమూరి తారక రామారావు మహాశయం. ఆ ఆశయాన్ని కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధితో అమలు చేస్తోంది,” అని అన్నారు.
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దూరదృష్టి, కూటమి ప్రభుత్వ చొరవతో కేవలం 17 నెలల్లోనే రాష్ట్రవ్యాప్తంగా 3 లక్షల గృహాలను పేదలకు మంజూరు చేయడం చారిత్రా త్మక ఘనతగా పేర్కొన్నారు.
నియోజకవర్గ వ్యాప్తంగా సామూహిక గృహప్రవేశాలు జరుగుతున్నాయని తెలియ జేస్తూ, లబ్ధిదారులకు రాష్ట్ర ప్రభుత్వం 40 శాతం (₹1.50 లక్షలు), కేంద్ర ప్రభుత్వం 60 శాతం (₹2.50 లక్షలు) వాటా నిధులు మంజూరు చేస్తోందని తెలిపారు. బిల్లుల చెల్లింపులో ఎటువంటి జాప్యం లేకుండా చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.
అంతకుముందు ప్రభుత్వ పాలనలో పేదల ఇల్లు విషయం లో ఇసుక కొరత సృష్టించి పేదలను ఇబ్బందులకు గురి చేసిన గత జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శిస్తూ, 2014–19లో మంజూరైన ఎన్టీఆర్ హౌసింగ్ లబ్ధిదారులకు రూ.920 కోట్లు చెల్లించకుండా నిలిపివేయడం పేదల పట్ల ద్రోహమని పేర్కొన్నారు. ప్రస్తుత కూటమి ప్రభుత్వం పేదలకు సౌకర్య వంతమైన గృహాలు అందించి, వారికీ ఆర్థిక భద్రత కల్పించే దిశగా ముందుకు సాగుతోందని చెప్పారు. నూతన గృహ ప్రవేశాలు చేసిన లబ్ధిదారులను ఆశీర్వదిస్తూ, “మీ కొత్త ఇళ్లలో సుఖసంతోషాలతో జీవించండి” అని ఎమ్మెల్యే ఆకాంక్షించారు.
ఈ సందర్భంగా లబ్ధిదారులకు స్వీట్లు, దేవుని చిత్రపటాలు అందజేశారు. కార్యక్రమంలో పాల్గొన్న వారు:
RDO బాలకృష్ణ, వత్సవాయి మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు వడ్లమూడి రాంబాబు, హౌసింగ్ పీడీ, స్థానిక తాసిల్దార్, అధికారులు,కూటమి నాయకులు, కార్యకర్తలు మరియు ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.