Contact Us Latest News
True news. Fast information. Andhra Pradesh • Telangana • National
Author Panel
Visakhapatnam

పేదలకు శాశ్వత హక్కులు కల్పించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యం గాజువాక నియోజకవర్గం శాసనసభ్యులు పల్లా శ్రీనివాసరావు

Punnami Newsroom Published: Updated:
పేదలకు శాశ్వత హక్కులు కల్పించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యం గాజువాక నియోజకవర్గం శాసనసభ్యులు పల్లా శ్రీనివాసరావు

Story highlights

  • గాజువాక,(పున్నమి ప్రతినిధి),సెప్టెంబర్ 30: 75వ వార్డు పరిధిలోని పులి భూలోక రెడ్డి కళ్యాణ మండపంలో పేదలకు పట్టాభిషేకం కార్యక్రమం నిర్వహించారు.
  • 64, 65, 74వ వార్డులకు చెందిన అర్హులైన లబ్ధిదారులకు ప్రభుత్వ స్థలాలపై శాశ్వత యాజమాన్య హక్కులు కల్పిస్తూ పట్టాలను పంపిణీ చేశారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గాజువాక నియోజకవర్గ శాసన సభ్యులు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర టీడీపీ అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు పాల్గొని లబ్ధిదారులకు పట్టాలు అందజేశారు.
  • ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం పేదల సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తోందన్నారు.

గాజువాక,(పున్నమి ప్రతినిధి),సెప్టెంబర్ 30:

75వ వార్డు పరిధిలోని పులి భూలోక రెడ్డి కళ్యాణ మండపంలో పేదలకు పట్టాభిషేకం కార్యక్రమం నిర్వహించారు. 64, 65, 74వ వార్డులకు చెందిన అర్హులైన లబ్ధిదారులకు ప్రభుత్వ స్థలాలపై శాశ్వత యాజమాన్య హక్కులు కల్పిస్తూ పట్టాలను పంపిణీ చేశారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గాజువాక నియోజకవర్గ శాసన సభ్యులు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర టీడీపీ అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు పాల్గొని లబ్ధిదారులకు పట్టాలు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం పేదల సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తోందన్నారు. అర్హులైన పేదలకు శాశ్వత హక్కులు కల్పించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని తెలిపారు. జీవీఎంసీ అభివృద్ధికి ప్రజల సహకారం అవసరమని అన్నారు.విశాఖ పార్లమెంటరీ నియోజకవర్గ టీడీపీ మాజీ ఉపాధ్యక్షులు పులి వెంకట రమణారెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో డి.సి.సి.బి చైర్మన్, రాష్ట్ర జనసేన పి.ఎ. సి సభ్యులు కోన తాతారావు, బీజేపీ గాజువాక నియోజకవర్గ ఇన్‌చార్జ్ కరణంరెడ్డి నరసింగరావు, జీవీఎంసీ మాజీ డిప్యూటీ మేయర్ దల్లి గోవిందరెడ్డి, 75వ వార్డు మాజీ కార్పొరేటర్, జీవీఎంసీ స్టాండింగ్ కమిటీ మాజీ సభ్యురాలు పులి లక్ష్మిబాయి వెంకట రమణారెడ్డి, ఆర్.డి.వో కళ్యాణ చక్రవర్తి, పెదగంట్యాడ మండల తహసీల్దార్ అమల, నాయకులు ప్రసాదుల శ్రీనివాస్, తిప్పల రమణారెడ్డి, మొల్లి పెంటి రాజు, నమ్మి అప్పారావు, ములకలపల్లి పెంటయ్య, వియ్యపు కొండబాబు, ముసలయ్య, సోము నాయుడు, సాంబ తదితరులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *