నెల్లూరు, ఆగష్టు 10, (పున్నమి ప్రతినిధి):
ఎగువ నుంచి వస్తున్న కృష్ణా జలాలతో సోమశిల జలాశయం నీటిమట్టం పెరుగుతోంది. కృష్ణా జలాల రాకముందు 29 టీఎంసీలు నీరు నిల్వ ఉండగా ప్రస్తుతం 39 టీఎంసీలకు నీటిమట్టం చేరింది. కండలేరు జలాశయానికి వరద కాలువ ద్వారా 6వేల క్యూసెక్కులు, పెన్నా డెల్టాకు 3,600 క్యూసెక్కులు సరఫరా చేస్తున్నారు. ఎగువ నుంచి 16 వేల క్యూసెక్కుల ప్రవాహం సోమశిలకు వస్తోంది.


