కామారెడ్డి 02 జనవరి,( పునమి ప్రతినిధి ) :
కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలం గ్రామంలో పెన్షన్ లబ్ధిదారుల సమస్యలను స్థానిక సర్పంచ్ బండి ప్రవీణ్ త్వరగా పరిష్కరించారు.లబ్ధిదారుల ఇంటి ఆవరణలకు వెళ్లి పెన్షన్ పంపిణీలో జాప్యా లు, ఇతర ఇబ్బందులను తెలుసుకున్నారు. సం బంధిత అధికారులతో మాట్లాడి జాప్యాలు జరగ కుండా చూసినారు.గ్రామంలో ఇటీవల ఆర్థిక సహా యాలు,కార్యక్రమాల్లో బండి ప్రవీణ్ ముందుం డటం ప్రత్యే కంగా గమనార్హం. గ్రామ అభివృద్ధి, ప్రజల సమస్య ల పరిష్కారంలో ఆయన చురు కుగా ఉంటూ గ్రామీణ ప్రజలకు ఆదర్శంగా నిలు స్తున్నారు.ప్రజల సంక్షేమానికి ముందుండే నాయ కుడు అని గ్రామస్తులు కొనియాడారు
టెంట్, త్రాగునీరు.. పూర్తి సౌకర్యాలు
లబ్ధిదారులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా టెంట్లు, త్రాగునీరు సదుపాయాలు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ హన్మయో ల్ల నవీన్, గ్రామ సిబ్బంది పాల్గొన్నారు. ప్రజల సేవలో సదా కట్టుబడి పనిచేస్తున్నారని బండి ప్రవీణ్ పేర్కొన్నారు.



