Sunday, 22 March 2026
  • Home  
  • *పెన్నా పరీవాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి..*
- శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

*పెన్నా పరీవాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి..*

*పెన్నా పరీవాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి..* *- తహసిల్దార్ శివకృష్ణయ్య సూచన..* *పొదలకూరు:* సోమశిల జలాశయం నుంచి వరద జలాలను పెన్నా నదికి విడుదల చేసియున్న నేపథ్యంలో పొదలకూరు మండలంలోని పెన్నా నది పరివాహక ప్రాంత గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తాహసిల్దార్ బీ శివకృష్ణయ్య సూచించారు. తాహసిల్దార్ కార్యాలయంలో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ విరువూరు సమీపంలోని సంగం బ్యారేజీ నుంచి సుమారు 30 వేల క్యూసెక్కుల నీటిని క్రిందికి వదులుతుండటంతో పెన్నానది తీర ప్రాంతాలైన విరువూరు, మహమ్మదాపురం గ్రామాల పశువుల కాపరులు నది వైపు వెళ్లకుండా జాగ్రత్తగా ఉండాలన్నారు. అలాగే పెన్నా నది వెంబడి నున్న సూరాయపాలెం గ్రామ రైతులు కూడా అప్రమత్తంగా ఉండాలన్నారు. పెన్నా నదిలో నీటి ప్రవాహం వస్తున్నందున నదిలోకి ఇసుక కోసం ఎవరూ వెళ్లే సాహసం చేయవద్దని సూచించారు. ఈ మేరకు పెన్నా తీర ప్రాంత గ్రామాలైన సూరాయపాలెం, విరువూరు, మహమ్మదాపురం గ్రామాల వీఆర్వోలు, వీఆర్ఏలు జాగ్రత్తలు తీసుకొని ఆయా గ్రామాల ప్రజలను పెన్నా నది వైపు వెళ్లకుండా అప్రమత్తం చేయాలని సూచించారు.

*పెన్నా పరీవాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి..*

*- తహసిల్దార్ శివకృష్ణయ్య సూచన..*

*పొదలకూరు:* సోమశిల జలాశయం నుంచి వరద జలాలను పెన్నా నదికి విడుదల చేసియున్న నేపథ్యంలో పొదలకూరు మండలంలోని పెన్నా నది పరివాహక ప్రాంత గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తాహసిల్దార్ బీ శివకృష్ణయ్య సూచించారు. తాహసిల్దార్ కార్యాలయంలో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ విరువూరు సమీపంలోని సంగం బ్యారేజీ నుంచి సుమారు 30 వేల క్యూసెక్కుల నీటిని క్రిందికి వదులుతుండటంతో పెన్నానది తీర ప్రాంతాలైన విరువూరు, మహమ్మదాపురం గ్రామాల పశువుల కాపరులు నది వైపు వెళ్లకుండా జాగ్రత్తగా ఉండాలన్నారు. అలాగే పెన్నా నది వెంబడి నున్న సూరాయపాలెం గ్రామ రైతులు కూడా అప్రమత్తంగా ఉండాలన్నారు. పెన్నా నదిలో నీటి ప్రవాహం వస్తున్నందున నదిలోకి ఇసుక కోసం ఎవరూ వెళ్లే సాహసం చేయవద్దని సూచించారు. ఈ మేరకు పెన్నా తీర ప్రాంత గ్రామాలైన సూరాయపాలెం, విరువూరు, మహమ్మదాపురం గ్రామాల వీఆర్వోలు, వీఆర్ఏలు జాగ్రత్తలు తీసుకొని ఆయా గ్రామాల ప్రజలను పెన్నా నది వైపు వెళ్లకుండా అప్రమత్తం చేయాలని సూచించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.