Thursday, 12 February 2026
  • Home  
  • *పెనుగంచిప్రోలు మండలంలో రోడ్ల పరస్థితి అద్వానం* *సంవత్సరకాలంగా ఇదే దుస్థితిలో రోడ్లు* *ఈ రోడ్లు కాస్త పట్టించుకోండి సారో అంటూ అధికారులకు ప్రజలు, ప్రయాణికుల మొర*
- ఎన్ టి ఆర్ జిల్లా

*పెనుగంచిప్రోలు మండలంలో రోడ్ల పరస్థితి అద్వానం* *సంవత్సరకాలంగా ఇదే దుస్థితిలో రోడ్లు* *ఈ రోడ్లు కాస్త పట్టించుకోండి సారో అంటూ అధికారులకు ప్రజలు, ప్రయాణికుల మొర*

పెనుగంచిప్రోలు మండలంలో సంవత్సరం పైబడి పాడైపోయి ఉన్న గుమ్మడిదుర్రు నుండి అనిగండ్లపాడు మీదుగా పెట్రోల్ బంక్ వరకు, అలాగే పెనుగంచిప్రోలు నుండి వేమవరం వెళ్లేదారిలో కాలువ కట్ట నుండి వేమవరం వరకు, ముచింతల రోడ్డు, ముళ్లపాడు రోడ్ల దుస్థితిని గూర్చి అధికారులు మర్చిపోయారేమో అనిపిస్తుంది. గత సంవత్సరం వరదల సమయంలో వచ్చిన వరద ప్రవాహానికి రోడ్లన్నీ తీవ్రంగా కొట్టుకొని పోయాయి. అయితే వాటికి తాత్కాలికంగా వాహనాలు తిరిగేలా మట్టి రోడ్లను ఏర్పాటు చేశారు కానీ నిత్యము ఈ రోడ్లపై ట్రాఫిక్ ఎక్కువగా ఉండడంతో కొన్ని చోట్ల అయితే అడుగు లోతు గుంటలు పడి నాలుగు చక్రాల వాహనాలపై ప్రయాణించే ప్రయాణికులకు కూడా ప్రాణ సంకటంగా మారింది. అయితే మళ్ళీ ఈ సంవత్సరం వచ్చిన వరదకు ఆ రోడ్లు ఇంకాస్త పాడైపోయి ఈ పరిస్థితి ఇంకాస్త ఎక్కువైంది నిత్యము రద్దిగా ఉండే ఈ రోడ్లపై ప్రయాణికులు ఇంత ఇబ్బందిపడుతున్న ఇంతకాలంగా ఈ రోడ్లు మరమ్మత్తులపై దృష్టి పెట్టకపోవడంపై ఈ రోడ్డు మరమ్మత్తు పనులు ఎందుకు నిర్లక్ష్యానికి గురవుతున్నాయా? అని ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొన్ని నెలల క్రితం నియోజకవర్గంలోని రోడ్ల మరమ్మత్తులు కొరకై ప్రభుత్వం నిధులు మంజూరు చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ నిధులను నియోజకవర్గంలోని రెండు రోడ్ల నిర్మాణాల కొరకు ఏర్పాటు చేయడంతో హర్షం వ్యక్తం చేస్తూనే వాటితో పాటు నిత్యం రద్దీగా ఉంటూ ప్రాణ సంకటంగా మారిన పెనుగంచిప్రోలు మండలంలోని ముళ్లపాడు, ముచింతల గుమ్మడిదూరు అనిగండ్లపాడు రోడ్డు అలాగె పెనుగంచిప్రోలు పాత వేమవరం రోడ్లపై కూడా దృష్టిని సారించాలని అధికారులను ప్రయాణికులు బలంగా కోరుతున్నారు

పెనుగంచిప్రోలు మండలంలో సంవత్సరం పైబడి పాడైపోయి ఉన్న గుమ్మడిదుర్రు నుండి అనిగండ్లపాడు మీదుగా పెట్రోల్ బంక్ వరకు, అలాగే పెనుగంచిప్రోలు నుండి వేమవరం వెళ్లేదారిలో కాలువ కట్ట నుండి వేమవరం వరకు, ముచింతల రోడ్డు, ముళ్లపాడు రోడ్ల దుస్థితిని గూర్చి అధికారులు మర్చిపోయారేమో అనిపిస్తుంది.
గత సంవత్సరం వరదల సమయంలో వచ్చిన వరద ప్రవాహానికి రోడ్లన్నీ తీవ్రంగా కొట్టుకొని పోయాయి. అయితే వాటికి తాత్కాలికంగా వాహనాలు తిరిగేలా మట్టి రోడ్లను ఏర్పాటు చేశారు కానీ నిత్యము ఈ రోడ్లపై ట్రాఫిక్ ఎక్కువగా ఉండడంతో కొన్ని చోట్ల అయితే అడుగు లోతు గుంటలు పడి నాలుగు చక్రాల వాహనాలపై ప్రయాణించే ప్రయాణికులకు కూడా ప్రాణ సంకటంగా మారింది. అయితే మళ్ళీ ఈ సంవత్సరం వచ్చిన వరదకు ఆ రోడ్లు ఇంకాస్త పాడైపోయి ఈ పరిస్థితి ఇంకాస్త ఎక్కువైంది
నిత్యము రద్దిగా ఉండే ఈ రోడ్లపై ప్రయాణికులు ఇంత ఇబ్బందిపడుతున్న ఇంతకాలంగా ఈ రోడ్లు మరమ్మత్తులపై దృష్టి పెట్టకపోవడంపై ఈ రోడ్డు మరమ్మత్తు పనులు ఎందుకు నిర్లక్ష్యానికి గురవుతున్నాయా? అని ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
కొన్ని నెలల క్రితం నియోజకవర్గంలోని రోడ్ల మరమ్మత్తులు కొరకై ప్రభుత్వం నిధులు మంజూరు చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ నిధులను నియోజకవర్గంలోని రెండు రోడ్ల నిర్మాణాల కొరకు ఏర్పాటు చేయడంతో హర్షం వ్యక్తం చేస్తూనే వాటితో పాటు నిత్యం రద్దీగా ఉంటూ ప్రాణ సంకటంగా మారిన పెనుగంచిప్రోలు మండలంలోని ముళ్లపాడు, ముచింతల గుమ్మడిదూరు అనిగండ్లపాడు రోడ్డు అలాగె పెనుగంచిప్రోలు పాత వేమవరం రోడ్లపై కూడా దృష్టిని సారించాలని అధికారులను ప్రయాణికులు బలంగా కోరుతున్నారు

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.