చిట్వేలు ఆగస్టు (పున్నమి ప్రతినిధి)
అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు నియోజకవర్గం చిట్వేలి మండలంలోని పెద్దూరు గ్రామంలో శివాలయంలో వెలసిన నందీశ్వరుడికి తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు కస్తూరి కోటేశ్వర చౌదరి వెండి నాగపడిగలు సమర్పించారు.
ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హాజరైన తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి శ్రీ కస్తూరి విశ్వనాధ నాయుడు ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థప్రసాదాలు స్వీకరించారు. అనంతరం ఆలయ కమిటీ సభ్యులు, పెద్దూరు గ్రామ ప్రజలు, ప్రముఖ పారిశ్రామికవేత్త మాచినేని విశ్వేశ్వర నాయుడు మరియు పలువురు నాయకులు కలిసి కస్తూరి విశ్వనాధ నాయుడు గారిని ఘనంగా సన్మానించారు.
ఈ సందర్భంగా రైల్వే కోడూరు నియోజకవర్గంలోని ఐదు మండలాల నుండి అనేక మంది ముఖ్య నాయకులు, బంధుమిత్రులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.


