
శ్రీకాకుళం నగరంలోని పెద్దపాడు ఆర్ట్ ఆఫ్ లివింగ్ హాపీనెస్ సెంటర్ లో ఆర్ట్ ఆఫ్ లివింగ్ సంస్థ ఆధ్వర్యంలో ఆగస్టు 12 నుండి 17 వరకు ప్రత్యేక యోగా శిక్షణ తరగతులు నిర్వహించబడతాయి. ఈ కార్యక్రమాన్ని ఆర్ట్ ఆఫ్ లివింగ్ గురుపూజ్యుడు డా. కె. అమ్మన్నాయుడు ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ దేశవ్యాప్తంగా యోగా, ధ్యానం, ప్రాణాయామం, సూక్ష్మవ్యాయామం, బ్రీథింగ్ ఎక్సర్సైజులు, ట్రైనింగ్ మొదలైన పలు అంశాలపై శిక్షణ ఇస్తున్నట్టు పేర్కొన్నారు.
ఈ శిబిరంలో శ్రద్ధగా పాల్గొన్న సీనియర్ సిటిజన్స్, విద్యార్థులు, మహిళలు, యువత ముఖ్యంగా 50 మందికిపైగా సాధకులు యోగా సాధనలో పాల్గొన్నారు. షీట్స్ వేసుకుని, శాంతమైన వాతావరణంలో యోగా, ధ్యానం, ప్రాణాయామం, సూర్యనమస్కారాలు, శ్వాసాభ్యాసాలు చేసిన వారి ఆనందం చూస్తే మానసికంగా వారిలో వచ్చిన మార్పు స్పష్టంగా కనిపించింది.
ఈ కార్యక్రమంలో కీలకంగా వ్యవహరిస్తున్న టీచర్ కింజరాపు అమ్మన్నాయుడు మాట్లాడుతూ, యోగా శిబిరం ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం రెండు సెషన్లలో జరుగుతుందని, ఆసక్తి ఉన్న వారు 7989752675 నెంబరుకు సంప్రదించాలని తెలిపారు.