Tuesday, 24 March 2026
  • Home  
  • *పెదగంట్యాడలో అంగరంగ వైభవంగా శ్రీ విజయ దుర్గా దేవి ఆలయం 12వ వార్షికోత్సవ వేడుకలు*
- విశాఖపట్నం

*పెదగంట్యాడలో అంగరంగ వైభవంగా శ్రీ విజయ దుర్గా దేవి ఆలయం 12వ వార్షికోత్సవ వేడుకలు*

పెదగంట్యాడ, అక్టోబర్ (పున్నమి ప్రతినిధి) జీవీఎంసీ 75వ వార్డులోని కండిపిల్లి వారి వీధిలో కొలువుతీరిన శ్రీ శ్రీ శ్రీ విజయ దుర్గా దేవి ఆలయం 12వ వార్షికోత్సవ వేడుకలు మంగళవారం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఆలయ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో అమ్మవారికి పంచామృత, సుగంధ ద్రవ్యాలతో జలాభిషేకాలు నిర్వహించి, సుందర వందనంగా అలంకరించి భక్తులకు దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ దల్లి గోవిందరెడ్డి, అరుణ థియేటర్ ప్రొప్రైటర్ తిప్పల నితీష్ రెడ్డి పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. డిప్యూటీ మేయర్ దల్లి గోవిందరెడ్డి మాట్లాడుతూ — > “కండిపిల్లి వారి వీధి అభివృద్ధి చెందిందంటే అమ్మవారి కటాక్షమే కారణం. 12వ వార్షికోత్సవం సందర్భంగా కమిటీ సభ్యులు చేస్తున్న భక్తి పరమైన సేవ ప్రశంసనీయమైనది” అని పేర్కొన్నారు. ఆయన చేతులమీదుగా అన్న సమారాధన కార్యక్రమం ప్రారంభమైంది. ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు రమేష్ శర్మ, ఈశ్వర్ శర్మ పూజా, అర్థమూ, చండీ హోమం నిర్వహించారు. కార్యక్రమంలో ఆలయ ధర్మకర్త దుర్యోధన లక్ష్మి, లావణ్య, వాసంశెట్టి వెంకటేశ్వరరావు, పాటోజీ త్రినాధరావు, సిహెచ్ తమ్మాయిరెడ్డి, కడవల రమణ, కండిపిల్లి వెంకటరమణ, సప్పరాంబాబు, కండిపిల్లి సత్యనారాయణ, కండిపిల్లి జోగారావు, బసరమాని శంకర్రావు, మాలకొండయ్య చౌదరి, కండిపిల్లి అప్పారావు, కరిట్ల శివ, కండిపిల్లి రమణ, నాగల అప్పారావు, కండిపిల్లి సురేష్, కండిపిల్లి గురుమూర్తి, కండిపిల్లి సత్యారావు, మణికంఠ తదితర గ్రామ మహిళలు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

పెదగంట్యాడ, అక్టోబర్ (పున్నమి ప్రతినిధి)

జీవీఎంసీ 75వ వార్డులోని కండిపిల్లి వారి వీధిలో కొలువుతీరిన శ్రీ శ్రీ శ్రీ విజయ దుర్గా దేవి ఆలయం 12వ వార్షికోత్సవ వేడుకలు మంగళవారం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఆలయ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో అమ్మవారికి పంచామృత, సుగంధ ద్రవ్యాలతో జలాభిషేకాలు నిర్వహించి, సుందర వందనంగా అలంకరించి భక్తులకు దర్శనమిచ్చారు.

ఈ సందర్భంగా గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ దల్లి గోవిందరెడ్డి, అరుణ థియేటర్ ప్రొప్రైటర్ తిప్పల నితీష్ రెడ్డి పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు.

డిప్యూటీ మేయర్ దల్లి గోవిందరెడ్డి మాట్లాడుతూ —

> “కండిపిల్లి వారి వీధి అభివృద్ధి చెందిందంటే అమ్మవారి కటాక్షమే కారణం. 12వ వార్షికోత్సవం సందర్భంగా కమిటీ సభ్యులు చేస్తున్న భక్తి పరమైన సేవ ప్రశంసనీయమైనది” అని పేర్కొన్నారు.

ఆయన చేతులమీదుగా అన్న సమారాధన కార్యక్రమం ప్రారంభమైంది.

ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు రమేష్ శర్మ, ఈశ్వర్ శర్మ పూజా, అర్థమూ, చండీ హోమం నిర్వహించారు.

కార్యక్రమంలో ఆలయ ధర్మకర్త దుర్యోధన లక్ష్మి, లావణ్య, వాసంశెట్టి వెంకటేశ్వరరావు, పాటోజీ త్రినాధరావు, సిహెచ్ తమ్మాయిరెడ్డి, కడవల రమణ, కండిపిల్లి వెంకటరమణ, సప్పరాంబాబు, కండిపిల్లి సత్యనారాయణ, కండిపిల్లి జోగారావు, బసరమాని శంకర్రావు, మాలకొండయ్య చౌదరి, కండిపిల్లి అప్పారావు, కరిట్ల శివ, కండిపిల్లి రమణ, నాగల అప్పారావు, కండిపిల్లి సురేష్, కండిపిల్లి గురుమూర్తి, కండిపిల్లి సత్యారావు, మణికంఠ తదితర గ్రామ మహిళలు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.