Monday, 30 March 2026
  • Home  
  • పెట్రోల్ బంక్ వద్ద ఆందోళన వాతావరణం – ఇంధనం కోసం వాహనదారుల ఆత్రం
- తూర్పు గోదావరి

పెట్రోల్ బంక్ వద్ద ఆందోళన వాతావరణం – ఇంధనం కోసం వాహనదారుల ఆత్రం

పున్నమి ప్రతినిధి, తాళ్లపూడి (తూర్పుగోదావరి జిల్లా), మార్చి 24:తాళ్లపూడిలోని హెచ్‌పీ పెట్రోల్ బంక్ వద్ద వాహనదారులు పెట్రోలు, డీజిల్ కోసం తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. ఇటీవల ఇంధనం సరఫరా విషయంలో ఏర్పడిన అనిశ్చితి కారణంగా వాహనదారులు ముందస్తుగా ట్యాంకులు నింపుకునేందుకు బంక్ వద్దకు భారీగా తరలి వస్తున్నారు. ఈ నేపథ్యంలో పెట్రోల్ బంక్ వద్ద పెద్ద ఎత్తున వాహనాలు క్యూలలో నిలబడటంతో రద్దీ వాతావరణం నెలకొంది.కొంతమంది ఇంధనం అందకపోతుందేమోనన్న భయంతో అదనంగా నిల్వ చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. మరోవైపు ఒక్కసారిగా పెరిగిన వినియోగదారుల రద్దీతో పెట్రోల్ బంక్ సిబ్బంది తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు. వాహనాల రద్దీ నియంత్రణలో కూడా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో వాహనదారులు అనవసర భయాందోళనలకు గురికాకుండా సాధారణ అవసరాలకు మాత్రమే ఇంధనం వినియోగించాలని స్థానికులు సూచిస్తున్నారు.

పున్నమి ప్రతినిధి, తాళ్లపూడి (తూర్పుగోదావరి జిల్లా), మార్చి 24:తాళ్లపూడిలోని హెచ్‌పీ పెట్రోల్ బంక్ వద్ద వాహనదారులు పెట్రోలు, డీజిల్ కోసం తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. ఇటీవల ఇంధనం సరఫరా విషయంలో ఏర్పడిన అనిశ్చితి కారణంగా వాహనదారులు ముందస్తుగా ట్యాంకులు నింపుకునేందుకు బంక్ వద్దకు భారీగా తరలి వస్తున్నారు.
ఈ నేపథ్యంలో పెట్రోల్ బంక్ వద్ద పెద్ద ఎత్తున వాహనాలు క్యూలలో నిలబడటంతో రద్దీ వాతావరణం నెలకొంది.కొంతమంది ఇంధనం అందకపోతుందేమోనన్న భయంతో అదనంగా నిల్వ చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు.
మరోవైపు ఒక్కసారిగా పెరిగిన వినియోగదారుల రద్దీతో పెట్రోల్ బంక్ సిబ్బంది తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు. వాహనాల రద్దీ నియంత్రణలో కూడా ఇబ్బందులు ఎదురవుతున్నాయి.
ఇలాంటి పరిస్థితుల్లో వాహనదారులు అనవసర భయాందోళనలకు గురికాకుండా సాధారణ అవసరాలకు మాత్రమే ఇంధనం వినియోగించాలని స్థానికులు సూచిస్తున్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.