Saturday, 28 February 2026
  • Home  
  • పెందుర్తి నియోజకవర్గంలో రూ. 2 కోట్ల అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాలు ఘనంగా
- విశాఖపట్నం

పెందుర్తి నియోజకవర్గంలో రూ. 2 కోట్ల అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాలు ఘనంగా

పెందుర్తి నియోజకవర్గం జీవీఎంసీ 93వ వార్డులో సుమారు రూ. 2 కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టిన పలు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాలు, శంకుస్థాపన కార్యక్రమాలు ఈరోజు ఘనంగా నిర్వహించబడ్డాయి. ఈ కార్యక్రమాలలో జనసేన పార్టీ ఉమ్మడి విశాఖపట్నం రూరల్ జిల్లా అధ్యక్షులు మరియు పెందుర్తి నియోజకవర్గ శాసనసభ సభ్యులు పంచకర్ల రమేష్ బాబు, విశాఖ నగర మేయర్ పీలా శ్రీనివాసరావు పాల్గొన్నారు. ఈ కార్యక్రమం జీవీఎంసీ 93వ వార్డు కార్పొరేటర్ రాపర్తి కన్నా ఆధ్వర్యంలో జరిగింది. అభివృద్ధి పనుల వివరాలు సాయి మాధవ్ నగర్: వినాయక ఆలయం ఎదురుగా కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి రూ. 20 లక్షలు, సీసీ రోడ్ల నిర్మాణానికి రూ. 19.63 లక్షలు. కృష్ణానగర్: హోమియోపతి ఆసుపత్రి వద్ద రూ. 31.50 లక్షలతో కమ్యూనిటీ హాల్ నిర్మాణం. బాలాజీ గార్డెన్స్: రూ. 19.87 లక్షల వ్యయంతో సీసీ రోడ్ల ప్రారంభోత్సవం. ప్రహ్లాదపురం: రూ. 18.50 లక్షలతో సీసీ రోడ్ నిర్మాణం, రూ. 35.20 లక్షలతో ఆరు సీసీ రోడ్ల ప్రారంభోత్సవం, కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి రూ. 19.98 లక్షలు. వెంకటాద్రి నగర్: రూ. 34 లక్షల వ్యయంతో సీసీ రోడ్ల నిర్మాణం. పోస్టల్ కాలనీ: రూ. 18.43 లక్షలతో సీసీ రోడ్ల నిర్మాణం. శ్రీనివాస్ నగర్: రూ. 15.50 లక్షల వ్యయంతో సీసీ రోడ్ల నిర్మాణం. పాత్రికేయ మిత్రులతో పంచకర్ల రమేష్ మాట్లాడుతూ “విశాఖను ఆర్థిక రాజధానిగా అభివృద్ధి చేయడం ద్వారా ఉత్తరాంధ్రకు విస్తృత ఉపాధి అవకాశాలు సృష్టించడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యం. రాష్ట్ర ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి నాయకత్వంలో కూటమి ప్రభుత్వం సంక్షేమం, అభివృద్ధి రెండు కళ్ళుగా ముందుకు సాగుతోంది. పెందుర్తి నియోజకవర్గంలోని ప్రతి వార్డును పూర్తిస్థాయిలో అభివృద్ధి చేయడం నా ప్రథమ కర్తవ్యం,” అని అన్నారు ఈ కార్యక్రమంలో మేయర్ పీలా శ్రీనివాసరావుతో పాటు, జీవీఎంసీ జోన్-8 జోనల్ కమిషనర్ శంకర్రావు, డి.ఈ. ప్రవీణ్, ఏ.ఈ. కుసుమ, మాజీ కార్పొరేటర్ రాపర్తి శైలజ, వార్డు అధ్యక్షులు తమరాడ ఆది బాబు, కోరుకొండ వరహాలు, ఎర్ర నాగరాజు, సేనాతీ దేవుడు, ఏఎంసీ డైరెక్టర్ లక్కీ గోవింద్, హైమావతి, పిన్నింటి పార్వతి, కంచిపాటి మధు, డి.బి.ఎల్. నాయుడు, మజ్జి సూరిబాబు, ఒబ్బిన శ్రీకాంత్, జగన్మోహన్ పాత్రుడు, జుత్తాడ శ్రీనివాసరావు, మోటూరు చైతన్య, రాపర్తి కిషోర్, తనకాల శ్రీనివాసరావు, కర్రీ శివ తదితరులు పాల్గొన్నారు. సాయి మాధవ్ నగర్, కృష్ణానగర్, బాలాజీ నగర్, ప్రహ్లాదపురం, వెంకటాద్రి నగర్ కాలనీ అసోసియేషన్ పెద్దలు, పెందుర్తి నియోజకవర్గ ఉమ్మడి ఎన్డీఏ మహాకూటమి నాయకులు, కార్యకర్తలు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

పెందుర్తి నియోజకవర్గం జీవీఎంసీ 93వ వార్డులో సుమారు రూ. 2 కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టిన పలు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాలు, శంకుస్థాపన కార్యక్రమాలు ఈరోజు ఘనంగా నిర్వహించబడ్డాయి. ఈ కార్యక్రమాలలో జనసేన పార్టీ ఉమ్మడి విశాఖపట్నం రూరల్ జిల్లా అధ్యక్షులు మరియు పెందుర్తి నియోజకవర్గ శాసనసభ సభ్యులు పంచకర్ల రమేష్ బాబు, విశాఖ నగర మేయర్ పీలా శ్రీనివాసరావు పాల్గొన్నారు.

ఈ కార్యక్రమం జీవీఎంసీ 93వ వార్డు కార్పొరేటర్ రాపర్తి కన్నా ఆధ్వర్యంలో జరిగింది.

అభివృద్ధి పనుల వివరాలు
సాయి మాధవ్ నగర్: వినాయక ఆలయం ఎదురుగా కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి రూ. 20 లక్షలు, సీసీ రోడ్ల నిర్మాణానికి రూ. 19.63 లక్షలు.

కృష్ణానగర్: హోమియోపతి ఆసుపత్రి వద్ద రూ. 31.50 లక్షలతో కమ్యూనిటీ హాల్ నిర్మాణం.

బాలాజీ గార్డెన్స్: రూ. 19.87 లక్షల వ్యయంతో సీసీ రోడ్ల ప్రారంభోత్సవం.

ప్రహ్లాదపురం: రూ. 18.50 లక్షలతో సీసీ రోడ్ నిర్మాణం, రూ. 35.20 లక్షలతో ఆరు సీసీ రోడ్ల ప్రారంభోత్సవం, కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి రూ. 19.98 లక్షలు.

వెంకటాద్రి నగర్: రూ. 34 లక్షల వ్యయంతో సీసీ రోడ్ల నిర్మాణం.

పోస్టల్ కాలనీ: రూ. 18.43 లక్షలతో సీసీ రోడ్ల నిర్మాణం.

శ్రీనివాస్ నగర్: రూ. 15.50 లక్షల వ్యయంతో సీసీ రోడ్ల నిర్మాణం.

పాత్రికేయ మిత్రులతో పంచకర్ల రమేష్ మాట్లాడుతూ
“విశాఖను ఆర్థిక రాజధానిగా అభివృద్ధి చేయడం ద్వారా ఉత్తరాంధ్రకు విస్తృత ఉపాధి అవకాశాలు సృష్టించడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యం. రాష్ట్ర ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి నాయకత్వంలో కూటమి ప్రభుత్వం సంక్షేమం, అభివృద్ధి రెండు కళ్ళుగా ముందుకు సాగుతోంది. పెందుర్తి నియోజకవర్గంలోని ప్రతి వార్డును పూర్తిస్థాయిలో అభివృద్ధి చేయడం నా ప్రథమ కర్తవ్యం,” అని అన్నారు

ఈ కార్యక్రమంలో
మేయర్ పీలా శ్రీనివాసరావుతో పాటు,
జీవీఎంసీ జోన్-8 జోనల్ కమిషనర్ శంకర్రావు, డి.ఈ. ప్రవీణ్, ఏ.ఈ. కుసుమ, మాజీ కార్పొరేటర్ రాపర్తి శైలజ, వార్డు అధ్యక్షులు తమరాడ ఆది బాబు, కోరుకొండ వరహాలు, ఎర్ర నాగరాజు, సేనాతీ దేవుడు, ఏఎంసీ డైరెక్టర్ లక్కీ గోవింద్, హైమావతి, పిన్నింటి పార్వతి, కంచిపాటి మధు, డి.బి.ఎల్. నాయుడు, మజ్జి సూరిబాబు, ఒబ్బిన శ్రీకాంత్, జగన్మోహన్ పాత్రుడు, జుత్తాడ శ్రీనివాసరావు, మోటూరు చైతన్య, రాపర్తి కిషోర్, తనకాల శ్రీనివాసరావు, కర్రీ శివ తదితరులు పాల్గొన్నారు.

సాయి మాధవ్ నగర్, కృష్ణానగర్, బాలాజీ నగర్, ప్రహ్లాదపురం, వెంకటాద్రి నగర్ కాలనీ అసోసియేషన్ పెద్దలు, పెందుర్తి నియోజకవర్గ ఉమ్మడి ఎన్డీఏ మహాకూటమి నాయకులు, కార్యకర్తలు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.