Friday, 27 February 2026
  • Home  
  • పూర్తి జీతాలు చెల్లించాలి
- విశాఖపట్నం

పూర్తి జీతాలు చెల్లించాలి

విశాఖపట్నం, ఫిబ్రవరి 27, పున్నమి ప్రతినిధి. విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మికులకు పూర్తి జీతాలు చెల్లించాలని స్టీల్ సిఐటియు ప్రధాన కార్యదర్శి జె అయోధ్య రామ్ యాజమాన్యాన్ని డిమాండ్ చేశారు. స్టీల్ కార్మికులుకు పూర్తి జీతాలు చెల్లించాలనే ప్రధాన డిమాండ్ తో స్టీల్ సిఐటియు ఆధ్వర్యంలో వేలాదిమంది కార్మికులు తమ నిరసనను తెలియజేస్తూ సంతకాలు చేశారు. ఆపత్తులను నేడు స్టీల్ ఉన్నత యాజమాన్యానికి స్టీల్ సిఐటియు ఉక్కు శిక్షణ కేంద్రం సమావేశ మందిరంలో అందజేశారు. ఈ సందర్భంగా స్టీల్ సిఐటియు ప్రధాన కార్యదర్శి జె అయోధ్యరామ్ మాట్లాడుతూ నేడు స్టీల్ ప్లాంట్లో ఉత్పత్తి తగ్గడానికి కారణం ఉన్నత యాజమాన్యం అనుసరించిన అనాలోచిత నిర్ణయాలే కారణమని ఆయన తీవ్రంగా విమర్శించారు. కార్మికులకు న్యాయంగా రావలసిన వేతనాలపై కార్మిక ఉన్నత అధికారులు యాజమాన్యాన్ని ఆదేశించిన వైఖరిలో ఎటువంటి మార్పు రాకపోవడం నిరంకుశ వైఖరికి నిదర్శనమని ఆయన వివరించారు. కార్మికులు 2012, అధికారులు 2007 జీతాలను తీసుకుంటున్నారని వాటిలో కూడా కోతలు విధిస్తే కుటుంబ పోషణ ఎలా సాధ్యమని ఆయన ప్రశ్నించారు. సహనానికైనా ఒక హద్దు ఉంటుందని ఆ హద్దు మీరి నేడు యాజమాన్యం చట్టాలు ఉల్లంఘిస్తూ నిరంకుశ నిర్ణయాలతో కార్మికులను బానిసలుగా చూడటం మంచిది కాదని ఆయన హితవుపలికారు. ఇప్పటికైనా ఉన్నత యాజమాన్యం తమ వైఖరిని మార్చుకొని పునరాలోచించి కార్మికులకు పూర్తి వేతనాలు చెల్లించే విధంగా చర్యలు చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు. స్టీల్ సిఐటియు అధ్యక్షులు యు రామస్వామి మాట్లాడుతూ లేబర్ కోడ్స్ అమలు కాకుండానే స్టీల్ యాజమాన్యం ఇక్కడ వాటి అమలుకు ఒక ప్రయోగశాల గా స్టీల్ ప్లాంట్ ను మారుస్తున్నారని ఆయన తీవ్రంగా విమర్శించారు. స్టీల్ తయారీకి అవసరమైన ముడి పదార్థాలను ఉన్నత యాజమాన్యం సకాలంలో అందిస్తే ఉత్పత్తి చేయడానికి స్టీల్ కార్మికులు సంసిద్ధంగా ఉన్నామని నిరూపించామని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. కార్మికుల త్యాగాన్ని గాని, అంకిత భావాన్ని గాని గుర్తించని యాజమాన్యం మొండి వైఖరితో పరిశ్రమలో అశాంతిని సృష్టించి కార్మికులను భయాందోళనకు గురి చేస్తూ పబ్బం గడుపుకోవాలని చూడడం దురదృష్టకరమని ఆయన అన్నారు. యాజమాన్యం తన వైఖరిని మార్చుకోకుంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కోక తప్పదని ఆయన హెచ్చరించారు. స్టీల్ జిఎం (హెచ్ఆర్) మధుసూదన్ గారు మాట్లాడుతూ స్టీల్ ఉత్పత్తికి ఎటువంటి అంతరాయం కలగకుండా మీరు చేసిన ఈ సంతకాల సేకరణ పతులను ఉన్నత యాజమాన్యం దృష్టికి తీసుకువెళ్తానని ఆయన అన్నారు. సమస్య తీవ్రతను నేను అర్థం చేసుకున్నానని ఉన్నత యాజమాన్యానికి మీ ఆవేదనను తెలియజేస్తానని ఆయన హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో స్టీల్ పర్సనల్ డిపార్ట్మెంట్ అధికారి డాక్టర్ రాధిక గారు, స్టీల్ సిఐటియు నాయకులు పి శ్రీనివాసరాజు, పుల్లారావు, టి వి కె రాజు, బి మహేష్, యు మరిడయ్య, బి ఎన్ మధుసూదన్, బి తౌడన్న, వి ప్రసాద్, అప్పలరాజు, పవన్, రాజు, శ్రీనివాస్ రెడ్డి, కృష్ణమూర్తి తదితరులతోపాటు వివిధ విభాగాల అధ్యక్ష కార్యదర్శులు మరియు కార్మికులు పాల్గొన్నారు.

విశాఖపట్నం, ఫిబ్రవరి 27, పున్నమి ప్రతినిధి.

విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మికులకు పూర్తి జీతాలు చెల్లించాలని స్టీల్ సిఐటియు ప్రధాన కార్యదర్శి జె అయోధ్య రామ్ యాజమాన్యాన్ని డిమాండ్ చేశారు. స్టీల్ కార్మికులుకు పూర్తి జీతాలు చెల్లించాలనే ప్రధాన డిమాండ్ తో స్టీల్ సిఐటియు ఆధ్వర్యంలో వేలాదిమంది కార్మికులు తమ నిరసనను తెలియజేస్తూ సంతకాలు చేశారు. ఆపత్తులను నేడు స్టీల్ ఉన్నత యాజమాన్యానికి స్టీల్ సిఐటియు ఉక్కు శిక్షణ కేంద్రం సమావేశ మందిరంలో అందజేశారు.
ఈ సందర్భంగా స్టీల్ సిఐటియు ప్రధాన కార్యదర్శి జె అయోధ్యరామ్ మాట్లాడుతూ నేడు స్టీల్ ప్లాంట్లో ఉత్పత్తి తగ్గడానికి కారణం ఉన్నత యాజమాన్యం అనుసరించిన అనాలోచిత నిర్ణయాలే కారణమని ఆయన తీవ్రంగా విమర్శించారు. కార్మికులకు న్యాయంగా రావలసిన వేతనాలపై కార్మిక ఉన్నత అధికారులు యాజమాన్యాన్ని ఆదేశించిన వైఖరిలో ఎటువంటి మార్పు రాకపోవడం నిరంకుశ వైఖరికి నిదర్శనమని ఆయన వివరించారు. కార్మికులు 2012, అధికారులు 2007 జీతాలను తీసుకుంటున్నారని వాటిలో కూడా కోతలు విధిస్తే కుటుంబ పోషణ ఎలా సాధ్యమని ఆయన ప్రశ్నించారు. సహనానికైనా ఒక హద్దు ఉంటుందని ఆ హద్దు మీరి నేడు యాజమాన్యం చట్టాలు ఉల్లంఘిస్తూ నిరంకుశ నిర్ణయాలతో కార్మికులను బానిసలుగా చూడటం మంచిది కాదని ఆయన హితవుపలికారు. ఇప్పటికైనా ఉన్నత యాజమాన్యం తమ వైఖరిని మార్చుకొని పునరాలోచించి కార్మికులకు పూర్తి వేతనాలు చెల్లించే విధంగా చర్యలు చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు.
స్టీల్ సిఐటియు అధ్యక్షులు యు రామస్వామి మాట్లాడుతూ లేబర్ కోడ్స్ అమలు కాకుండానే స్టీల్ యాజమాన్యం ఇక్కడ వాటి అమలుకు ఒక ప్రయోగశాల గా స్టీల్ ప్లాంట్ ను మారుస్తున్నారని ఆయన తీవ్రంగా విమర్శించారు. స్టీల్ తయారీకి అవసరమైన ముడి పదార్థాలను ఉన్నత యాజమాన్యం సకాలంలో అందిస్తే ఉత్పత్తి చేయడానికి స్టీల్ కార్మికులు సంసిద్ధంగా ఉన్నామని నిరూపించామని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. కార్మికుల త్యాగాన్ని గాని, అంకిత భావాన్ని గాని గుర్తించని యాజమాన్యం మొండి వైఖరితో పరిశ్రమలో అశాంతిని సృష్టించి కార్మికులను భయాందోళనకు గురి చేస్తూ పబ్బం గడుపుకోవాలని చూడడం దురదృష్టకరమని ఆయన అన్నారు. యాజమాన్యం తన వైఖరిని మార్చుకోకుంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కోక తప్పదని ఆయన హెచ్చరించారు.
స్టీల్ జిఎం (హెచ్ఆర్) మధుసూదన్ గారు మాట్లాడుతూ స్టీల్ ఉత్పత్తికి ఎటువంటి అంతరాయం కలగకుండా మీరు చేసిన ఈ సంతకాల సేకరణ పతులను ఉన్నత యాజమాన్యం దృష్టికి తీసుకువెళ్తానని ఆయన అన్నారు. సమస్య తీవ్రతను నేను అర్థం చేసుకున్నానని ఉన్నత యాజమాన్యానికి మీ ఆవేదనను తెలియజేస్తానని ఆయన హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో స్టీల్ పర్సనల్ డిపార్ట్మెంట్ అధికారి డాక్టర్ రాధిక గారు, స్టీల్ సిఐటియు నాయకులు పి శ్రీనివాసరాజు, పుల్లారావు, టి వి కె రాజు, బి మహేష్, యు మరిడయ్య, బి ఎన్ మధుసూదన్, బి తౌడన్న, వి ప్రసాద్, అప్పలరాజు, పవన్, రాజు, శ్రీనివాస్ రెడ్డి, కృష్ణమూర్తి తదితరులతోపాటు వివిధ విభాగాల అధ్యక్ష కార్యదర్శులు మరియు కార్మికులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.