సీతారామపురం సెప్టెంబర్ (పున్నమి ప్రతినిధి)
సీతారామపురం మండలంలోని అయ్యవారిపల్లి పంచాయతీకి చెందిన జనసేన నాయకుడు తులబందుల సురేష్ ను పూణే లో వినాయక చవితి ఉత్సవాలను నిర్వహిస్తున్న కమిటీ సభ్యులు ప్రత్యేకంగా ఆహ్వానించారు. పూణేవాసులు జనసేన నేత తులబందుల సురేష్ కు శాలువా కప్పి సత్కరించారు. వినాయకుని విగ్రహం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థప్రసాదాలను అందించారు. ఈ సందర్భంగా తులబందల సురేష్ మాట్లాడుతూ పుట్టిన ఊరికే కాకుండా పూణేలో కూడా జనసేన పార్టీ తరఫున అనేక సేవా కార్యక్రమాలను చేస్తున్నానని గుర్తించిన పూణేవాసులు ప్రత్యేకంగా తనను పిలిచి పూజలు చేయించడం సంతోషంగా ఉందన్నారు. సొంత ఊరు సీతారామపురం మండలంలోని అయ్యవారిపల్లి గ్రామానికి కూడా జనసేన జిల్లా రాష్ట్రస్థాయి నాయకుల సూచనలు ఆదేశాల మేరకు తన వంతు ఎన్నో సహాయ సహకారాలు చేస్తున్నానని భవిష్యత్తులో కూడా అయ్యవారిపల్లి పంచాయతీ అభివృద్ధికి మరిన్ని పనులను చేస్తానన్నారు.


