Thursday, 5 February 2026
  • Home  
  • పుష్ప సినిమా స్టైల్లో గోవుల స్మగ్లింగ్..
- E-పేపర్

పుష్ప సినిమా స్టైల్లో గోవుల స్మగ్లింగ్..

*పుష్ప సినిమా స్టైల్లో గోవుల స్మగ్లింగ్….* అబ్దుల్లాపూర్మెట్ మండల పున్నమి న్యూస్ ప్రతినిధి: రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గం ఇంచార్జ్ : 25 డిసెంబర్ 2025 అబ్దుల్లాపూర్మెట్ మండల కేంద్రం వద్ద విజయవాడ హైవే పై 70కి పైగా ఆవులను అక్రమంగా తరలిస్తున్న లారీని గోరక్షక కార్యకర్తలు అడ్డుకొని పట్టుకున్నారు. నిందితులు పోలీసుల కళ్లుగప్పేందుకు లారీ పైభాగంలో తాడిమట్టలతో ప్రత్యేకంగా అరలను ఏర్పాటు చేసి, వాటి కింద గోవులను దాచారు. అంతేకాకుండా, ఈ లారీకి ఒకవైపు హర్యానా, మరోవైపు తెలంగాణ రిజిస్ట్రేషన్ నంబర్ ప్లేట్లు ఉండటం గమనార్హం. అనుమానం వచ్చి తనిఖీ చేయగా ఈ దారుణం వెలుగుచూసింది. కార్యకర్తలు వెంటనే లారీని పోలీస్ స్టేషన్ తరలించి, నిందితులపై చర్యలు తీసుకోవాలని కోరారు.

*పుష్ప సినిమా స్టైల్లో గోవుల స్మగ్లింగ్….*

అబ్దుల్లాపూర్మెట్ మండల

పున్నమి న్యూస్ ప్రతినిధి:
రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గం ఇంచార్జ్ :
25 డిసెంబర్ 2025

అబ్దుల్లాపూర్మెట్ మండల కేంద్రం వద్ద విజయవాడ హైవే పై 70కి పైగా ఆవులను అక్రమంగా తరలిస్తున్న లారీని గోరక్షక కార్యకర్తలు అడ్డుకొని పట్టుకున్నారు. నిందితులు పోలీసుల కళ్లుగప్పేందుకు లారీ పైభాగంలో తాడిమట్టలతో ప్రత్యేకంగా అరలను ఏర్పాటు చేసి, వాటి కింద గోవులను దాచారు. అంతేకాకుండా, ఈ లారీకి ఒకవైపు హర్యానా, మరోవైపు తెలంగాణ రిజిస్ట్రేషన్ నంబర్ ప్లేట్లు ఉండటం గమనార్హం. అనుమానం వచ్చి తనిఖీ చేయగా ఈ దారుణం వెలుగుచూసింది. కార్యకర్తలు వెంటనే లారీని పోలీస్ స్టేషన్ తరలించి, నిందితులపై చర్యలు తీసుకోవాలని కోరారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.