పుల్లంగేరు ప్రవాహాన్ని పరిశీలించిన కలెక్టర్ నిశాంత్ కుమార్, సబ్ కలెక్టర్ సి.హెచ్ భావన
పుల్లంగేరు నుండి పుల్లంపేట, మరియు పుత్తనవారిపల్లి చెరువులుకు ఎన్నో దశాబ్దాలుగా నీళ్లు రాని తరుణంలో రైల్వే కోడూరు తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ మరియు,కు.డా చైర్మన్ ముక్కా రూపానందరెడ్డి దృష్టికి తీసుకెళ్లగా ఆయన కలెక్టర్ నిశాంత్ కుమార్ గారికి తెలియజేయడంతో వెంటనే స్పందించి ఈరోజు పుల్లంపేట రైల్వే స్టేషన్ దగ్గర ఉన్న కాలువ పనులను పరిశీలించి,అనంతరం అప్పయ్య రాజుపేట పంచాయతీ పెరయవరంఅరుంధతి వాడ దగ్గర ఉన్న చెక్ డ్యామ్ ను, మరియు పుల్లంగేరు ప్రవాహాన్ని పరిశీలించారు. పుల్లంగేరు నుండి నుండి కాలువలు పూడిపోయి చెరువులకు నీళ్లు రాకుండా ఉంటే పరిశీలించి, తమదృష్టికి తీసుకురావాలని,కాలువలతో అన్ని చెరువులు నిండేటట్లు చూడాలని ఇరిగేషన్ ఏ.ఈ. ఈ నాగేంద్ర నాయక్ ను ఆదేశించారు. అలాగే పుల్లంపేట మండలంలో చెరువులకు ఎక్కడైనా గండ్లుపడి నీరు వృధా అయ్యే పరిస్థితి ఉంటే ప్రమాదాన్ని ముందే గమనించి తగు చర్యలు తీసుకోవాలని పుల్లంపేట మండల తహసిల్దార్ పుల్లారెడ్డిని ఆదేశించారు.కలెక్టర్ గారు జోరువర్షాన్ని కూడా లెక్కచేయకుండా పుల్లంపేట మండలంలో పర్యటించినందుకు మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు కాపెర్ల చంద్రశేఖర్ నాయుడు ధన్యవాదములు తెలియజేశారు. రైల్వే కోడూరు తెలుగుదేశం పార్టీ ఇన్చార్జి ముక్కారూపానంద రెడ్డి గారు, పుల్లంపేట మండలం మీద ప్రత్యేక దృష్టి పెట్టారని,అందులకు కలెక్టర్ గారు కూడా సహకరించి పుల్లంపేట మండలాన్ని అన్ని విధాల అభివృద్ధి చేయాలని కోరగా అందులకు కలెక్టర్ నిశాంత్ కుమార్,సబ్ కలెక్టర్ సి.హెచ్ భావన గారు సానుకూలంగా స్పందించి సమస్యలను మా దృష్టికి తీసుకురావాలని చెప్పారు. కలెక్టరు పర్యటన లో ఏ.వో శ్రీధర్ రెడ్డి,ఆర్.ఐ రాజశేఖర్ మరియు రెవెన్యూ సిబ్బంది ఉన్నారు.
ఈ కార్యక్రమంలో ఎక్స్ మార్కెట్ కమిటీ చైర్మన్ నేలపాటి రామచంద్రయ్య నాయుడు,మాజీ మండలాధ్యక్షులు ఆరే సుధాకర్ నాయుడు,పోలూరు కృష్ణమ నాయుడు,బత్తిన వేణుగోపాల్ రెడ్డి,క్లస్టర్ ఇంచార్జ్ చుండు ఈశ్వర్ నాయుడు,యూనిట్ ఇన్చార్జి అణపాలచంద్ర, సెక్రటరీ జీ.కేసుబ్బారెడ్డి,ఆదినారాయణ రెడ్డి,శంకర్ రెడ్డి,రామచంద్రారెడ్డి, మాదినేనిబలరామయ్యనాయుడు,పోలు ప్రేమకుమార్,కుప్పాల రామకృష్ణయ్య,మల్లికార్జున,ఒలేటి వెంకట్,బాలకృష్ణ,రామయ్య, మరియు చుట్టుపక్కల గ్రామ ప్రజలు యన్.డి.ఏకూటమి నాయకులు పాల్గొన్నారు.


