నంద్యాల, పున్నమి స్టాఫ్ రిపోర్టర్ ఆర్ ఎన్ రెడ్డి:
ఉమ్మడి ప్రభుత్వం ఉన్నంతకాలం రాష్ట్రంలో వైసీపీ రౌడీ రాజకీయాలు ఇక సాగవని, కృష్ణానది నీరు పులివెందులకు తీసుకొచ్చిన ఘనత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకే దక్కిందని, రఫ్ఫా రఫ్ఫా రాజకీయ స్కూల్ ప్రిన్సిపాల్ జగన్ బెంగళూరుకు మకాం మార్చాడని, ఇక్కడి వైసీపీ తమ్ముళ్లు దిక్కుతోచని పరిస్థితిలో ఉన్నారని, వైసీపీ ఎన్ని ఆరాచకాలు, దౌర్జన్యాలు చేసినా పులివెందుల జడ్ పి టి సి ఉప ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి లతారెడ్డి గెలుపు ఖాయమని నంద్యాల పార్లమెంట్ సభ్యురాలు, లోక్ సభ టీడీపీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ డాక్టర్ బైరెడ్డి శబరి ధీమా వ్యక్తం చేశారు.
శనివారం కడప జిల్లా పులివెందుల జడ్ పి టి సి ఉప ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి లతారెడ్డి గెలుపు కోసం ఆర్. తుమ్మలపల్లె గ్రామంలో ఇంటింటికి వెళ్లి ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి ప్రచారం నిర్వహించారు.
ఈ సందర్బంగా ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి మాట్లాడుతూ
రఫ్ఫా రఫ్ఫా రాజకీయాలు చేసే స్కూల్ పెట్టిన ప్రిన్సిపాల్ జగన్ మకాం బెంగుళూరుకు మార్చాడనీ,
ఇక్కడ ఉన్న ఆయన అనుచరులు, వైసీపీ నాయకులకు దిక్కుతోచక ఏదేదో చేస్తున్నారన్నారు.
దాడిలో గాయపడితే ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లాల్సిన ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ జగన్ మామ గంగిరెడ్డి ఆసుపత్రికి ఎందుకు వెళ్లారని,
ఊరూరా సాక్షి లైవ్ వాహనాలు దింపారు ఎందుకనీ,
వాళ్లను మేము ఏమైనా చేస్తే ఇష్యూ చేయాలనా అని ఎంపీ డాక్టర్ బైరెడ్డి నిలదీశారు.
టీడీపీ ప్రజాస్వామ్య బద్దంగా ఎన్నికలలో పోటీ చేస్తోందని,
పులివెందుల జడ్ పి టి సి ఉప ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి లతారెడ్డి గెలిచి తీరుతుందనీ ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి ధీమా వ్యక్తం చేశారు.
2019 ఎన్నికప్పుడు సొంత చిన్నాన్ననే హత్య చేశారనీ,
ఇలాంటి వాళ్ళు దౌర్జన్యాలు, దాడులు కాక ఇంకేం చేస్తారనీ ఆమె మండిపడ్డారు. ఈ ప్రచారంలో టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహాక కార్యదర్శి డాక్టర్ కాకరవాడ చిన్న వెంకటస్వామి, పులివెందుల టీడీపీ నాయకులు పాల్గొన్నారు.


