విశాఖపట్నం : సెప్టెంబర్ 9వ తేదీ నుండి దుబాయ్ వేదికగా జరగనున్న ఆసియా కప్ టీమిండియా మేనేజర్ గా జనసేన పార్టీ యువ నాయకులు మరియు భీమవరం శాసనసభ్యులు శ్రీ పులపర్తి రామాంజనేయులు గారి తనయుడు శ్రీ పులపర్తి ప్రశాంత్ గారు ఎన్నికైన సందర్భంగా జనసేన పార్టీ అధ్యక్షులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు అభినందించారు, అలాగే రానున్న రోజుల్లో మరిన్ని పదవులు సాధించాలని అన్నారు. అలాగే విశాఖపట్నంలోని రుషికొండలో ఏర్పాటు చేసిన భవనాలను క్రికెట్ కార్యక్రమాలకు ఉపయోగపడేలాగా చూడాలని సూచించారు. ఈ కార్యక్రమంలో భీమవరం శాసనసభ్యులు శ్రీ పులపర్తి రామాంజనేయులు గారు మరియు జనసేన నాయకులు పాల్గొన్నారు.

పులపర్తి ప్రశాంత్ గారికి అభినందనలు తెలియజేసిన జనసేన పార్టీ అధ్యక్షులు