చిట్వేలి ఆగస్టు (పున్నమి ప్రతినిధి)
అన్నమయ్య జిల్లా చిట్వేలి మండలంలో మానవతా శాఖ అడ్వైజర్ బోర్డ్ సభ్యుడు మద్దిన చంద్రమోహన్ గారి పుట్టినరోజు సందర్భంగా సోమవారం శ్రీ నారాయణ తపోవనం ఆశ్రమంలో వృద్ధులకు నిత్యవసర సరుకులు పంపిణీ చేశారు. అనంతరం కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు.
ఆశ్రమ పీఠాధిపతి నాగేశ్వరమ్మ దాతను ఘనంగా సత్కరించారు. మానవతా శాఖ తరఫున మెమెంటో అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో చైర్మన్ సాయిరాం, కో చైర్మన్ గుత్తి నరసింహ, కన్వీనర్ దొండ్లవాగు శ్రీనివాసులు, కార్యదర్శి మునిరావు, సభ్యులు శివరాజు, బాజీ, చింటూ, చంద్రశేఖర్, ఆశ్రమ నిర్వాహకులు తదితరులు పాల్గొన్నారు.


